ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?

జెలెన్ స్కీకి షాక్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీవ్ర వివాదస్పద నిర్ణయాలతో తరచూ వార్తలల్లో నిలుస్తున్నారు. దుందుడుకు చర్యలతో పలు దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. గ్రీన్ ల్యాండ్ ‌ను అమెరికాకు అమ్మివేయాలని ప్రతిపాదన తీసుకువచ్చారు. డెన్మార్క్‌తో గిల్లికజ్జాలు పెట్టుకున్నారు.. ఆ తర్వాత పనామా కాలువను అమెరికాకు ఇచ్చేయాలని ఆ దేశ అధ్యక్షుడుపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు ట్రంప్. మొన్నటికి మొన్న పాలస్తీనాలోని గాజాను బలవంతంగానైనా ఆక్రమించుకుంటామంటూ బహిరంగంగానే ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్.. తాజాగా గత మూడేళ్లుగా రష్యాతో అలుపెరగని పోరాటం చేస్తున్న ఉక్రెయిన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.

ఖనిజాలపై 50 శాతం హక్కులు

ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం అందించాలంటే తమ డిమాండ్స్ తీర్చాల్చిందే అంటూ ఆదేశ అద్యక్షుడు జెలెస్కీ ముందు ప్రతిపాధనలు పెట్టారు డోనాల్డ్ ట్రంప్. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికాకు 50% యాజమాన్యపు హక్కులు కల్పించాలనే విషయాన్ని వాషింగ్టన్ సూచించింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదిరితే, ఆ ఖనిజాలను రక్షించేందుకు ఉక్రెయిన్‌లో అమెరికా సైన్యాన్ని మోహరించేందుకు కూడా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు అందించిన బిలియన్ల డాలర్ల సాయం , ఆయుధ సరఫరాకు ప్రతిఫలంగా ఉక్రెయిన్‌ తిరిగి చెల్లించాల్సిన రీతిగా ఆమెరికా ఈ అరుదైన ఖనిజాల్లో యాజమాన్య హక్కులను కోరుతున్నట్లు అధికారులు తెలిపారు.

జెలెన్స్కీ అంగీకరించేనా?

ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనను అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీకు ఒక ముసాయిదా ఒప్పంద రూపంలో అందజేశారు. అయితే ఈప్రతిపాదన పత్రాలపై జెలెన్స్కీ వెంటనే సంతకాలు చేయలేదు. ఈ ప్రతిపాదనపై సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఈ అరుదైన ఖనిజాల విలువ దాదాపు 500 బిలియన్ డాలర్ల ఉంటుందని అంచనా. అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ సూత్రపాయంగా అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. అయితే వీటిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా, దీనిని సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.

రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఖనిజాలు

ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖనిజాలు చాలా భాగం ప్రస్తుతం రష్యా సైనికుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయని అమెరికా పేర్కొంటుంది. అటు తమ ముఖ్యమైన వనరులను అమెరికా మద్దతుకు ప్రతిఫలంగా వినియోగించాలని భావిస్తున్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అమెరికా మద్దలు లేకుండా ఉక్రెయిన్ సమర్థవంతంగా పోరాడటం కష్టమని , ఇది అత్యంత కీలకమై అంశం అని జెలెన్క్సీ స్పష్టం చేశారు.

Related Posts
మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
medical shops

ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం Read more

రథసప్తమి వేళ సిఫారసు లేఖల దర్శనాలు రద్దు : టీటీడీ
Cancellation of darshan of letters of recommendation on Ratha Saptami

తిరుమల: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి శుక్రవారం సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, Read more

టాటా ఏస్ EV ఫ్లీట్‌తో లాస్ట్-మైల్ డెలివరీని విప్లవాత్మకంగా మారుస్తున్న గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ
Green drive mobility revolutionizing last mile delivery with Tata Ace EV fleet

హైదరాబాద్ : సుస్థిరమైన అర్బన్ లాజిస్టిక్స్ వైపు గణనీయమైన పురోగతితో, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవంలో కీలకపాత్ర పోషిస్తూ.. అగ్ర ఆటగాళ్లలో ఒకటిగా Read more

ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more