41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత అక్రమ వలసదారులు, రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలపై చర్చించారు. డిఫెన్స్, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర పెట్టుబడులు పెట్టడానికీ అంగీకారం తెలియజేశారు. చెప్పేదొకటి..చేసేదొకటి.. అవేవీ కూడా పెద్దగా ఫలించేలా కనిపించట్లేదు ట్రంప్ వైఖరి చూస్తోంటే. అనూహ్యంగా భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్.
మార్-ఎ-లాగో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్..
ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల చెల్లింపులను నిలిపివేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తాజాగా వైట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ ముక్కుసూటిగా సమాధానాలను ఇచ్చారు. మార్-ఎ-లాగో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ప్రకటించారు.

 భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్

భారత్‌కు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి?
ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు 21 మిలియన్ డాలర్ల మేర చెల్లింపులను రద్దు చేయడం పట్ల ఓ మీడయా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చారు ట్రంప్. భారత్‌కు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయి.. అని చెప్పారు.భారత్‌పై నోరుపారేసుకున్న ట్రంప్.

ఆర్థికపరమైన కేటాయింపులన్నింటినీ రద్దు
డోజ్ అధికారిక ప్రకటన.. ఇటీవలే ఈ 21 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) దీన్ని రద్దు చేసింది. భారత్‌తో పాటు వివిధ ప్రాజెక్టుల కింద మరికొన్ని దేశాలకు అందజేస్తోన్న ఆర్థికపరమైన కేటాయింపులన్నింటినీ రద్దు చేసింది. ఇటీవలే ఈ 21 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) దీన్ని రద్దు చేసింది.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అమెరికా తన ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందని, భారత్‌కు నష్టం కలిగే విధంగా చర్యలు తీసుకుంటే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొన్ని సహాయ పథకాలను రద్దు చేయడం, భారత స్టార్టప్‌లు, పరిశ్రమలకు నిధుల ప్రవాహాన్ని తగ్గించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా తరఫున తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో భారత-అమెరికా వాణిజ్య సంబంధాలపై దుష్ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, అమెరికాలో భారతీయ విద్యార్థులు, వలసదారులపై ప్రభావం చూపే విధంగా వీసా నియంత్రణ, ఉద్యోగావకాశాలపై కఠినమైన నిబంధనలను కూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది భారత ఐటీ ఉద్యోగులకు, విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు చెడుదెబ్బగా మారొచ్చని భావిస్తున్నారు.

భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. పన్నుల పెంపుతో భారత దిగుమతులపై నియంత్రణ విధించే అవకాశాలు ఉన్నాయని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా, ఇండో-పసిఫిక్ వ్యూహంపై భారత్ కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ వ్యూహానికి భిన్నంగా ఉన్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలపై కొత్త మార్గాన్ని సూచించే అవకాశముంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Related Posts
సిరియాలో ఘర్షణలు – 1113 మంది మృతి
సిరియాలో ఘర్షణలు – 1113 మంది మృతి

సిరియాలో అల్లకల్లోల పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. రెండు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 1,113 మంది మరణించారు. మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ మద్దతుదారులు, ప్రభుత్వ Read more

ONDC చిన్న వ్యాపారాలకు సాధికారత: మోదీ
ONDC చిన్న వ్యాపారాలకు సాధికారత: మోదీ

ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించి, ఇ-కామర్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం Read more

Sudha Murthy: కోట్ల ఆస్తులు వున్నా ఒక్క చీర కూడా కొనని సుధా నారాయణ మూర్తి
Sudha Murthy: కోట్ల ఆస్తులు వున్నా ఒక్క చీర కూడా కొనని సుధా నారాయణ మూర్తి

ధనవంతులు, సంపన్నుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ కాస్త ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే ఎంత సంపాదించిన లేదా ఎంత సంపాదన ఉన్నసరే Read more

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
budget 2025

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల Read more