41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

సైనిక విమానాల్లో భారతీయులను వెనక్కి పంపుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో అమెరికన్లకు మాటిచ్చినట్లుగానే ప్రస్తుతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న ఇండియన్స్ ఏ మూలన దాగి ఉన్నా ఏరి ఏరి వెనక్కి పంపించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ భారతీయ అక్రమ వలసదారులను యుద్ధ విమానంలో తిరిగి వెనక్కి పంపించటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అమెరికాలో సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్న 18,000 మంది భారతీయులను తిప్పి పంపిస్తున్నారు. భారతీయులను తిరిగి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించినప్పటికీ ఇందుకు సరిపడా సమయం కూడా అందించకుండా ట్రంప్ తన పని తాను చేసుకుపోతున్నారు. అక్రమ వలసదారులను తిరిగి వెనక్కు పంపేందుకు అమెరికా తన సైన్యాన్ని, యుద్ధ విమానాలను ఉపయోగించటం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

Advertisements

ప్రస్తుతం ట్రంప్ అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులను తరలించటానికి సీ-17 మిలిటరీ విమానాలను వాడుతున్నారు. ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వారి దేశాలకు డిపోర్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ప్రధానీ మోదీ కూడా ఫోన్ కాల్ ద్వారా చర్చించారు. అయినప్పటికీ ట్రంప్ తన దూకుడు వైఖరితో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అమెరికా వాయుసేన విమానంలో బయలుదేరిన భారతీయ అక్రమవసలదారులతో కూడిన సీ-17 విమానం 24 గంటల్లో ఇండియాకు చేరుకుంటుందని రాయిటర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ చర్యలతో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న దాదాపు 7.25 లక్షల మంది వలసదారులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 2.5 శాతం మంది అక్రమ వలసదారులను తిప్పి ఇండియాకు పంపుతున్నారు. ప్రస్తుతం డిపోర్టేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలు తాము కూడా టార్గెట్ అవుతామేమో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Related Posts
ట్రంప్ కేబినెట్‌లో ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి కీలక పాత్రలు
20241112 musk ramaswamy split

ఎలన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి, ట్రంప్ కేబినెట్‌లో కీలక పాత్రలను పోషించడానికి చర్చలు జరిపినట్లు నివేదికలు ప్రకటిస్తున్నాయి. ఈ ప్రముఖ వ్యక్తులు, తమ వ్యాపార అనుభవంతో Read more

ప్రధానమంత్రి మోదీ నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనతో కొత్త వ్యాపార అవకాశాలు
Modi Ji

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలను పర్యటించడానికి బయలుదేరారు. ఈ పర్యటనలో, భారతదేశం ఈ మూడు దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను Read more

నేపాలీ విద్యార్థులకు ప్రధాని ఓలి సూచన
నేపాలీ విద్యార్థులకు ప్రధాని ఓలి సూచన

ఒడిశాలో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య ఒడిశాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నేపాలీ విద్యార్థిని పాకృతి లామ్సల్ Read more

మరో రెండు విమానాల్లో రానున్న భారతీయులు
Indians coming in two more flights

అక్రమ వలసదారుల డిపోర్టేషన్ న్యూఢిల్లీ: అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, మరో Read more