చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాల రచ్చ మరింత ముదురుతోంది. ఏప్రిల్ 2న యుఎస్ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలను విధిస్తు ప్రకటించింది. అయితే ఈ దేశాలలో భారతదేశం కూడా ఉండటం గమనార్హం. అయితే తాజాగా చైనా వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది. దింతో చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 104 శాతం సుంకం విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ అదనపు సుంకాల మోతలు ఏప్రిల్ 9 మంగళవారం అర్ధరాత్రి నుండి అమల్లో ఉంటాయి. వాషింగ్టన్ అండ్ బీజింగ్ మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇప్పటివరకు తీసుకున్న అత్యంత కీలక చర్యలలో ఇది ఒకటి. ఫాక్స్ బిజినెస్ ప్రకారం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, అమెరికాపై చైనా ప్రతీకార సుంకాలను ఎత్తివేయలేదని అన్నారు.

Advertisements
చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

చైనా దిగుమతులపై మొత్తం 104% విధింపు
అలాగే అమెరికా ఏప్రిల్ 9 నుండి చైనా దిగుమతులపై మొత్తం 104% సుంకాన్ని విధించడం ప్రారంభిస్తుందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ సోమవారం చైనాపై 50 శాతం సుంకం విధించడం గురించి స్పందించారు. అమెరికా వస్తువులపై చైనా 34 శాతం ప్రతీకార సుంకం విధించిన తర్వాత ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 8 నాటికి చైనా 34 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే, అమెరికా అదనంగా మరో 50 శాతం సుంకాన్ని విధిస్తామని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గడానికి చైనా నిరాకరించింది అలాగే అమెరికాతో పోటికీ దిగింది.
చైనాపై 104% సుంకం ఎలా విధించారు?
డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 50% సుంకం తర్వాత, ఇప్పుడు అమెరికాలో చైనా వస్తువులపై సుంకం 104 శాతానికి చేరుకుంది. వాస్తవానికి, అమెరికా చైనాపై 34% పరస్పర సుంకాన్ని విధించింది, ఇది ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా చైనా వస్తువులపై అదనంగా 20% సుంకాన్ని కూడా విధించింది. తాజాగా 50% అదనపు సుంకం విధించడంతో చైనాపై సుంకం రేటు 104%కి చేరుకుంది.

ఆర్థిక బెదిరింపులు
ఈ విధానం అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాణిజ్య పరంగా అమెరికాను చాలా దారుణంగా చూశాయని డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాల విధానంపై డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక బెదిరింపులను చూపిస్తున్నారని చైనా పేర్కొంది. అంతర్జాతీయ నియమాల కంటే అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వడం ఏకపక్షవాదం ఇంకా ఆర్థిక బెదిరింపులు లాంటిదని చైనా చెబుతోంది. అమెరికా సుంకాల విధానం ప్రపంచ ఉత్పత్తి, సప్లయ్ చైన్ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని చైనా ఆరోపిస్తోంది.

కుదేలైన ప్రపంచ మార్కెట్లు

ప్రపంచ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు గట్టి షాకిచ్చారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 104 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దెబ్బతో ప్రపంచ మార్కెట్లు మరోమారు కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లు ఇప్పటికే నష్టాలను చవిచూశాయి. నిన్న ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు తొలుత లాభాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే, ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ప్రారంభంలో 4.1 శాతానికిపైగా లాభంతో ట్రేడ్ అయింది. చివరికి 1.6 శాతం పతనమైంది. ఫిబ్రవరిలో నమోదైన రికార్డు నుంచి ఈ సూచీ ఇప్పటి వరకు 19 శాతం దిగజారింది. మరోవైపు, డౌజోన్స్ కూడా నిన్న 0.8 శాతం, నాస్‌డాక్ 2.1 శాతం మేర కుంగిపోయాయి.

READ ALSO: Donald Trump Tariffs : అమెరికా, చైనా ట్రేడ్ వార్తో భారత్కు మేలు – రఘురామ్

Related Posts
మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి
Ram Nath Kovind mourns the death of Manmohan Singh

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి Read more

సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు
manchuvishnu

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల Read more

ఫ్లాగ్ షిప్ సౌండ్ బార్స్ ను విడుదల చేసిన ఎల్‌జీ
LG Launches Premium Flagship Sound Bars in India

న్యూఢిల్లీ: వైర్ లెస్ డాల్బీ అట్మోస్ మరియు ట్రూ వైర్ లెస్ రియర్ సరౌండ్ స్పీకర్స్ తో తమ కొత్త సౌండ్ బార్స్ - LG S95TR Read more

Harish Rao : ఇందిరమ్మ ఎమర్జెన్సీలా రేవంత్ పాలన : హరీశ్ రావు
Revanth rule is like Indiramma Emergency.. Harish Rao

Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రశాంతంగా వారు నిరసన ర్యాలీలు తీస్తుంటే పోలీసులు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×