Ram Nath Kovind mourns the death of Manmohan Singh

మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి అని ఆయన అభివర్ణించారు. మన్మోహన్‌ సింగ్‌ మరణం దేశానికి తీరనిలోటు మాత్రమే కాదని, వ్యక్తగతంగా తనకు కూడా లోటేనని అన్నారు. ఆయన తనకు చాలాకాలంగా తెలుసని, పొలైట్‌నెస్‌కు ఆయన గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఆయన భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పిగా తాను భావిస్తానని, తాను ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ కూడా మన్మోహన్‌కు నివాళులర్పించారు.

కాగా, గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలువురు నేతలు మన్మోహన్‌కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Related Posts
బడ్జెట్‌లో వందే భారత్ రైళ్లకు భారీ నిధులు
బడ్జెట్ లో వందే భారత్ రైళ్లకు భారీ నిధులు

వివరాల్లోకి వేళ్ళగా 2025 కేంద్ర బడ్జెట్‌లో భారత రైల్వేలకు ₹2.64 లక్షల కోట్లు కేటాయించామని, కొత్త ప్రాజెక్టులకు ₹4.16 లక్షల కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి Read more

రథసప్తమి వేడుకలకు జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ
తిరుమల రథసప్తమి వేడుకలకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట Read more

రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..
Another Telugu student commits suicide in America

వాషింగ్టన్‌ : మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు Read more