manchuvishnu

సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల కోసం మోహన్ బాబు యూనివర్సిటీలో 50 శాతం స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రకటించాడు. సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారి పిల్లల విద్యకు తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసలందుకుంటోంది. సైనికుల సేవలను స్మరించుకుంటూ, ఈ నిర్ణయం ద్వారా ఇతర విద్యా సంస్థలు కూడా స్పూర్తి పొందాలని విష్ణు ఆశించాడు. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు ఇటీవల వార్తల్లో నిలిచినప్పటికీ, ఈ సానుకూల చర్యకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విష్ణు నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

vishnu
vishnu

ఇది మాత్రమే కాకుండా, విష్ణు తన దత్తత పిల్లల గురించి కూడా ఇటీవల వీడియో ద్వారా వెల్లడించాడు. 120 మంది పిల్లల్ని దత్తత తీసుకుని, వారికి ఉచిత విద్యా, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తన పనుల ద్వారా మరికొందరికి స్పూర్తి కలిగించాలని కోరారు. తాను చేస్తున్న మంచి పనులు ఇతరులను ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రతి సోమవారం కొత్త పోస్టర్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్‌ను పార్వతీ మాతగా, అక్షయ్ కుమార్‌ను పరమేశ్వరుడిగా పరిచయం చేశారు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, విష్ణు సమాజం కోసం చేస్తున్న సేవలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Related Posts
ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీని ప్రారంభించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank launched IDFC First Academy

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి వేసిన ముందడుగు.. హైదరాబాద్ : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సమగ్ర ఆర్థిక అక్షరాస్యతకార్యక్రమం అయిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీనిప్రారంభించినట్లు Read more

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం
Chandrababu వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ప్రణాళిక కింద రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి Read more

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం వాయిదా
Telangana Assembly special session start postponed

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ Read more

తెలంగాణ లీడర్ల లేఖలపై షాక్‌ ఇచ్చిన టీటీడీ !
TTD shocked by Telangana leaders' letters!

అమరావతి: వారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలపై టీటీడీ పాలక మండలి షాక్‌ ఇచ్చింది . సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. ఈ Read more