అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మంగళవారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీ తోనూ ఫోన్ ద్వారా బుధవారం కీలక చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనను విన్నానని ట్రంప్ తెలిపారు. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఈ మేరకు జెలెన్ స్కీతో ఫోన్లో మాట్లాడిన వివరాలను డొనాల్డ్ ట్రంప్ పంచుకున్నారు.

ఫోన్లో మాట్లాడినట్లు చెప్పిన ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్ స్కీతో ఫోన్టో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. దాదాపు గంటపాటు తమ సంభాషణ కొనసాగిందన్నారు. నిన్న పుతిన్ తో చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరువర్గాల అభ్యర్థనలు, అవసరాలపై ఇవి కొనసాగుతాయన్నారు డొనాల్డ్ ట్రంప్.
త్వరలోనే జరిగిన తాజా పరిణామాలపై వివరాలు
సరైన దారిలోనే ముందుకెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ శాఖ మంత్రి మార్కూ రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖైల్ వాల్ట్‌లను ఆదేశిస్తానని డొనల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే జరిగిన తాజా పరిణామాలపై వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
శాశ్వత శాంతి కోసం ఇరుదేశాలు ముందుకు రావాలి
అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని, శాశ్వత శాంతి కోసం ఇరుదేశాలు ముందుకు రావాలని ట్రంప్ కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రంప్ ఫోన్ చేస్తే.. సుమారు గంటపాటు పుతిన్ వెయిట్ చేయించినట్లు సమాచారం. ఆ తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఇరుదేశాధి నేతలు చర్చలు జరిపారు. అయితే, ఉక్రెయిన్ భూభాగం రష్యాలోనే ఉందని అమెరికా గుర్తించాలని ట్రంప్ ముందు పుతిన్ డిమాండ్ పెట్టినట్లు సమాచారం.