అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మధ్య ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్చి 11న ట్రంప్, మస్క్ వైట్ హౌస్ సౌత్ లాన్‌లో టెస్లా మోడల్ ఎస్ రెడ్ కారును పరిశీలించారు. ఈ క్రమంలో ట్రంప్ టెస్లాకు తన మద్దతును ప్రకటిస్తూ, పూర్తి ధర చెల్లించి కారును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా టెస్లాకు చెందిన ఎలక్ట్రిక్ కారును ఎలాన్ మస్క్ ఏకంగా 80000 డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవానికి తనకు మస్క్ డిస్కౌంట్ ఇస్తాడని కానీ తాను ప్రయోజనం పొందినట్లు దీనిని కొందరు భావిస్తారని అందుకే తాను మెుత్తం రేటుకు చెక్ రాస్తున్నట్లు ట్రంప్ అన్నారు. ముఖ్యంగా టెస్లా స్టాక్ ధరలు తగ్గిన సందర్భంలో ట్రంప్ టెస్లాకు తన మద్ధతును ప్రకటించే క్రమంలో ఈ సరికొత్త సెడాన్ మోడల్ రెడ్ కారును కొనుగోలు చేశారు. టెస్లా కంపెనీ ఇటీవల స్టాక్ ధరల పతనం, వ్యతిరేక ప్రదర్శనలను ఎదుర్కొంటున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎలాన్ మస్కును కూర్చోపెట్టుకుని ట్రంప్ డ్రైవ్
వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్ట్ ట్రంప్ క్యాంపెయిన్ కోసం భారీగా విరాళాలు అందించిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ మస్క్‌ను “అమెరికాకు గొప్ప సేవలు అందిస్తున్న ఒక నిజమైన దేశభక్తుడు” అని కొనియాడారు. కొన్ని టెస్లా షోరూమ్‌లపై జరిగిన దాడులను “ఉగ్రవాదం” అని ట్రంప్ అభివర్ణించారు. దాడులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ నిపుణులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ట్రంప్ చర్యను మస్క్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు అభివర్ణిస్తుండగా.. మరికొందరు దీనిని రాజకీయ లబ్ధి ధోరణిలోనే చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త టెస్లా కారులో ఎలాన్ మస్కును కూర్చోపెట్టుకుని ట్రంప్ డ్రైవ్ చేశారు. వాస్తవానికి లోపల పనితీరు పూర్తిగా ఆధునిక కంప్యూటర్ సాంకేతికత సాయంతో నడవటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త టెస్లా కాను వైట్ హౌస్ సిబ్బంది ఉపయోగిస్తారని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. అద్భుతమైన ఎరుపు రంగు మోడల్ S కారు కేవలం విలాసానికి చిహ్నం మాత్రమే కాదని అత్యాధునిక అమెరికన్ ఆవిష్కరణలకు మస్క్ మద్దతుకు చిహ్నంగా ట్రంప్ భావించారు.
మస్క్ కు ట్రంప్ మద్దతు
మస్క్ కు ట్రంప్ మద్దతు ప్రజల అవగాహన మార్కెట్ విలువ పరంగా చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించగలదు. సవాళ్లు ఉన్నప్పటికీ, టెస్లా ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో ఒక మార్గదర్శకుడిగా పరిగణించబడుతుంది. 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక వ్యక్తులలో ఒకరిగా మస్క్ నిలిచేలా ఇది చేస్తోంది. మస్క్ ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.