పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్ – బలోచ్ మిలిటెంట్ల ఘాతుకం

Baluchistan: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్ – బలోచ్ మిలిటెంట్ల ఘాతుకం

పాకిస్థాన్ జైళ్లలోని తమ నాయకులను విడిపించుకోవడానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ హైజాక్ తో పాకిస్థాన్ ఆర్మీ స్పందించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మిలిటెంట్ల చెరలో ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని ప్రకటించింది.

Advertisements
పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్ – బలోచ్ మిలిటెంట్ల ఘాతుకం

ప్రకటనను ఖండించిన బీఎల్ఏ

రైలులోని 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సైనికులు చనిపోయారని పేర్కొంది. మిగతా ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనను బీఎల్ఏ ఖండించింది. ట్రైన్ హైజాక్ తర్వాత పాక్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించామని, ఆలోగా పాక్ జైళ్లలోని తమ వారిని విడుదల చేయకపోతే బందీలను చంపేస్తామని హెచ్చరించామని గుర్తుచేసింది.

214 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడి

ప్రభుత్వం స్పందించకపోవడంతో డెడ్ లైన్ ముగియగానే తమ బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడించింది. పట్టాలను పేల్చివేసి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్నామని వివరించింది. ట్రైన్ లోని ప్రయాణికుల్లో పాక్ సోల్జర్లు కూడా ఉన్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని, హైజాక్ చేసిన చోటునుంచి వారిని దూరంగా తరలించామని పేర్కొంది. తమ హెచ్చరికలను పాక్ ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో గత్యంతరం లేక వారందరినీ మట్టుబెట్టామని బీఎల్ఏ ప్రతినిధి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి.
పాక్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బలోచ్ మిలిటెంట్ల పెరుగుతున్న ఉగ్రవాద చర్యలపై ప్రపంచ సమాజం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Related Posts
హెచ్-1బీ వీసా భారీ ఫీజులు, కొత్త రూల్స్
హెచ్-1బీ వీసా భారీ ఫీజులు, కొత్త రూల్స్

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కొనసాగుతున్న చర్చల మధ్య, 2025 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుదారులు మరియు వారి యజమానులు వర్క్ పర్మిట్ మరియు ఖర్చుల పరంగా క్లిష్ట పరిస్థితులను Read more

Kannappa: అమెరికాలో మే 8 నుంచి ‘కన్నప్ప’ సినిమా ప్రచారం
Kannappa: అమెరికాలో మే 8 నుంచి 'కన్నప్ప' సినిమా ప్రచారం

మంచు విష్ణు మరియు మోహన్ బాబు "కన్నప్ప" సినిమాను పెద్ద స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో Read more

భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం
భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం

యూరోపియన్ యూనియన్ (EU) భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్‌తో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో, EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ Read more

‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. Read more

Advertisements
×