రోజురోజుకు దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మధ్యప్రదేశ్ ఇందౌర్‌కు చెందిన ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రత్యేక స్టైల్‌ను ఎంచుకున్నారు. సిగ్నల్ వద్ద పాటలు పాడుతూ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలను వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ నియమాలపై అవగాహన
వినూత్న పద్ధతిని ఎంచుకున్న సోనాలి
ఇందౌర్ పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళా ట్రాఫిక్ పోలీస్ సోనాలి సోని. ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పాటల ద్వారా ఇందౌర్‌లోని అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్
సోనాలి తన పాటలతో ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం వల్ల రద్దీ తగ్గింది. అలాగే ఆమె పాడిన రెండు పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెకు నెట్టింట పాపులారిటీ ఫుల్‌గా పెరిగింది. నగరంలోని అనేక కూడళ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి సోనాలికి భారీ డిమాండ్ ఏర్పడింది. “రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి ట్రాఫిక్‌లో వావాహనదారులను అపినా, మందలించినా వారు పట్టించుకోరు. అందుకే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ తెలిసేలా పాటలు పాడాను. అది మంచి ప్రభావం చూపింది. నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. కూడలిలో వేగంగా వెళ్లే డ్రైవర్లు రెడ్ లైట్ పడగానే సాంగ్ ప్లే చేస్తే నెమ్మదిగా వస్తారు. సోనాలి పాడిన ‘ట్రాఫిక్ మే బీ ఇందౌర్ కో నంబర్ వన్ బనాయేంగే, తోడా సాత్ ఆప్ డోజే యేబీ కర్ జయేంగే (ట్రాఫిక్‌లో కూడా ఇందౌర్ ను నంబర్ వన్‌గా మారుస్తాం.
Read Also: Pahalgham Terrorist: పహల్గాం ఉగ్రవాది ఫొటో బయటకు.. సోషల్ మీడియాలో వైరల్!