: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఆర్థిక విధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పారు. అనేక దేశాలు తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య లోటు భారీగా పడిపోయిందన్నారు. ఈ క్రమంలో పలు దేశాలతో వాణిజ్య సుంకాలు విధించడం తప్పనిసరి అన్నారు. అందుకోసం ప్రధానంగా చైనా, యూరోపియన్ యూనియన్ (EU) సహా ఇతర దేశాలపై సుంకాలు విధించడం తప్పదన్నారు.
జాతీయ ప్రయోజనాలు
ట్రంప్ తన వ్యాఖ్యలలో అమెరికా లోటు తగ్గాలంటే సుంకాలు తప్పదన్నారు. సుంకాలు ఒక ఆర్థిక వ్యూహంగా, జాతీయ ప్రయోజనాలు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ట్రంప్ ప్రకారం, సుంకాలు కేవలం ఆదాయ వనరుగా కాకుండా, అమెరికా ఆర్థిక స్వావలంబనను పెంచుతుందన్నారు. పలువురు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ప్రజలు మాత్రం ఏదో ఒక రోజు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisements
: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

జో బైడెన్ నిద్రపోతున్న అధ్యక్షుడు
అంతేకాదు ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై మరోసారి విమర్శలు చేశారు. ఆయనను నిద్రపోతున్న అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. బైడెన్ పాలనలో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగిందని, ప్రత్యేకంగా, చైనా, యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సంబంధాలు మరింత దిగజారాయన్నారు. బైడెన్ విధానాలు విదేశీ పోటీదారులకు అనుకూలంగా మారాయని, అవి అమెరికన్ పరిశ్రమను బలహీనపరిచాయని ట్రంప్ తెలిపారు.
గణాంకాలు, వాణిజ్య లోటు
అమెరికా వాణిజ్య పరిస్థితి ప్రస్తుతం చాలా అండర్ స్ట్రెయిన్ ఉందని ట్రంప్ అన్నారు. 2024లో, అమెరికా, చైనా మధ్య వాణిజ్య లోటు $295.4 బిలియన్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే 5.8% ఎక్కువ. అలాగే, యూరోపియన్ యూనియన్ వాణిజ్య లోటు 2024లో $235.6 బిలియన్లుగా నమోదైంది.

READ ALSO: Donald Trump: చర్చానీయాంశంగా మారిన ట్రంప్​ ‘మూడోసారి’ ఎన్నిక

Related Posts
Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!
Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి Read more

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సింగపూర్‌తో వ్యాపార, రాజకీయ సంబంధాలపై చర్చ
jai

భారతదేశం మరియు సింగపూర్ మధ్య సంబంధాలు అనేక సంవత్సరాలుగా సుదీర్ఘమైన మరియు సుస్థిరమైన పరిణామాలను పొందినవి. ఈ రెండు దేశాలు ఆర్థిక, వ్యాపార, సంస్కృతి, సైనిక మరియు Read more

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్
టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున Read more

అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి
అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×