ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (WHO) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలోని వూహాన్‌లో ఉద్భవించిన కరోనా మహమ్మారిని నిర్వహించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందు వల్లే ఆ సంస్థ నుంచి వైదొలిగామని వెల్లడించింది. కరోనా మహమ్మారి కట్టడికి అత్యవసర చర్యలను డబ్ల్యూహెచ్‌ఓ చేపట్టలేదని పేర్కొంది. కొన్ని దేశాల అక్రమ రాజకీయ ప్రభావం నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా పనిచేయడంలోనూ ఆ సంస్థ విఫలమైందని అమెరికా సర్కారు ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
Read Also: Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాక్ సహా 8 ఇస్లామిక్ దేశాల అంగీకారం

కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ సరిగ్గా పనిచేయలేదు: ట్రంప్
“డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 14155 కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా తప్పుకుంది. డబ్ల్యూహెచ్‌ఓ వల్ల ఎదురవుతున్న పలు రకాల అడ్డంకులను అధిగమించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ సరిగ్గా పనిచేయలేదు. ఆ వ్యాధిని కట్టడి చేయడంలో విఫలమైంది. దీని ప్రతికూల ప్రభావాన్ని అమెరికా ప్రజలు అనుభవించాల్సి వచ్చింది. చాలా అంతర్జాతీయ సంస్థలలాగే డబ్ల్యూహెచ్‌ఓ కూడా చేసిన ప్రమాణాలపై నిలువలేకపోయింది. దాని ప్రాథమిక లక్ష్యం నుంచి డబ్ల్యూహెచ్‌ఓ దారి తప్పింది.
అమెరికా నిష్క్రమణకు ఇంకా ఆమోదముద్ర వేయలేదు
“డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక దేశాల్లో అమెరికా ఒకటి. ఆ సంస్థకు ఏటా భారీ విరాళాలు ఇచ్చే దేశం కూడా మాదే. అయినప్పటికీ అమెరికా శత్రుదేశాలకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ పనులు చేసింది. ఆయా దేశాల రాజకీయ ప్రభావానికి లోబడి నిర్ణయాలు తీసుకుంది. అమెరికా నుంచి చేకూరిన ప్రయోజనాలను డబ్ల్యూహెచ్‌ఓ మర్చిపోయింది. తన వైఫల్యాలకు ‘ప్రజారోగ్య ప్రయోజనాలు’ అనే ముద్రను డబ్ల్యూహెచ్‌ఓ వేసుకుంది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన కార్యాలయం ఎదుటనున్న అమెరికా జెండాను అప్పగించేందుకూ డబ్ల్యూహెచ్‌ఓ నిరాకరించింది. అమెరికా నిష్క్రమణకు ఇంకా ఆమోదముద్ర వేయలేదని ఆ సంస్థ వాదిస్తోంది.
ప్రజారోగ్యంలో ప్రపంచ సారథిగా అమెరికా
“అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత కోసమే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగాం. డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బంది నిర్వహణకు, కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేయడాన్ని ఆపేశాం. ప్రజారోగ్యంలో ప్రపంచ సారథిగా అమెరికా నిలుస్తుంది. సాంక్రమిక వ్యాధులు అమెరికా గడ్డపైకి చేరకుండా అన్ని చర్యలు చేపడతాం. ఇందుకోసం ప్రత్యక్ష, ద్వైపాక్షిక, పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యాలను కుదుర్చుకుంటాం. ప్రపంచ దేశాలతో పాటు మేం విశ్వసించే కొన్ని ఆరోగ్య సంస్థలతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాం. డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ రాజకీయాలు, పలు దేశాల ప్రయోజనాల పరిరక్షణకు పాకులాడుతూ సరి చేయలేని దుస్థితికి డబ్ల్యూహెచ్‌ఓ చేరుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: