అమెరికా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను విదేశీ హ్యాకర్ల నుంచి రక్షించాల్సిన బాధ్యత కలిగిన ఓ ఉన్నతాధికారి.. స్వయంగా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. తెలుగు మూలాలున్న మధు గొట్టుముక్కల(Madhu goṭṭumukkala) ప్రస్తుతం అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన చేసిన ఈ పొరపాటు అమెరికా భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చాట్‌జీపీటీలో ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్ గతేడాది వేసవిలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే మధు గొట్టుముక్కల ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సున్నితమైన కాంట్రాక్టింగ్ పత్రాలను చాట్‌జీపీటీ పబ్లిక్ వెర్షన్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రభుత్వ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లకుండా ఆపే ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలారమ్స్ ఈ చర్యతో ఒక్కసారిగా మోగాయి.
Read Also: Plane Crash: అజిత్ పవార్ దుర్మరణం.. బారామతిలో విషాదం

ఉద్యోగులెవరూ చాట్‌జీపీటీ వాడకూడదని నిషేధం
ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ ఉల్లంఘన అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ఆ సమయంలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఉద్యోగులెవరూ చాట్‌జీపీటీ వాడకూడదని నిషేధం ఉంది. కానీ మధు గొట్టుముక్కల తన అధికారంతో ఐటీ విభాగంపై ఒత్తిడి తెచ్చి, తన కోసం ప్రత్యేకంగా అనుమతి పొందారు. “ఆయన బలవంతంగా అనుమతి తీసుకున్నారు, ఆపై దాన్ని దుర్వినియోగం చేశారు” అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసే ఏ డేటా అయినా ఓపెన్ ఏఐ సర్వర్లలో నిక్షిప్తమై, ఇతర వినియోగదారులకు సమాధానాలు ఇచ్చేందుకు వాడబడే అవకాశం ఉంటుంది. ‘పాలిగ్రాఫ్’ పరీక్షలో విఫలం? మధు గొట్టుముక్కల చుట్టూ ఉన్న వివాదం కేవలం చాట్‌జీపీటీతో ఆగలేదు. అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పొందేందుకు ఆయన ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ పాలిగ్రాఫ్ (అబద్ధాల గుర్తింపు పరీక్ష) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న మధు గొట్టుముక్కల సుమారు 24 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న నిపుణుడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి రాజకీయ నియామకం పొందిన వారిలో ఈయన ఒకరు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బీఈ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్‌లో ఎంబీఏ చేశారు. డకోటా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. రష్యా, చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే సైబర్ దాడుల నుండి అమెరికా ఫెడరల్ నెట్‌వర్క్‌లను రక్షించడం ఈయన ప్రధాన విధి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: