हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

India: ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

Vanipushpa
India: ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

ఇరాన్ యుద్ధనౌకను అమెరికా హిందూ మహాసముద్రంలో బుధవారం టార్పెడోతో పేల్చివేసి, ముంచేసింది.
ఈ ఘటనకు సంబంధించి దేశంలోని విపక్షాలు ప్రధాన మంత్రి మోదీపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ ఘటన మార్చి 4న జరిగింది. అయితే, అమెరికా చేసిన ప్రకటనలో యుద్ధనౌక పేరు పేర్కొనలేదు. కానీ, తమ సాయం కోరుతూ ఇరాన్ యుద్ధ నౌక దేనా నుంచి ‘డిస్ట్రెస్ కాల్’ (విపత్కర సమయంలో సాయం కోరుతూ చేసే కాల్) వచ్చినట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపిన తర్వాత, అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది. అమెరికా దాడిపై ఇరాన్ స్పందించింది. ఈ దాడి అనంతరం, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ(Syed Abbas Araghchi) అమెరికాపై ఘాటుగా స్పందించారు. ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో “ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో, సముద్రంలో అమెరికా నేరానికి పాల్పడింది. ఇండియన్ నేవీకి అతిథిగా, 130 మంది నావికులతో వెళ్లిన ది ఫ్రిగేట్ డేనాపై అంతర్జాతీయ సరిహద్దులో, ఎలాంటి హెచ్చరికా లేకుండా అమెరికా దాడి చేసింది. నా మాటలు రాసిపెట్టుకోండి.. అమెరికా తన చేష్టలకు భారీ మూల్యం చెల్లించక తప్పదు” అని రాశారు. ఈ ఇరానియన్ యుద్ధనౌక ఇటీవల విశాఖపట్నంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సైనిక విన్యాసాల్లో పాల్గొంది.

Read Also: Iran Israel War: భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

India: US attack on Iranian ship.. Opposition leaders criticize Modi's silence
India: US attack on Iranian ship.. Opposition leaders criticize Modi’s silence

మోదీ ప్రభుత్వంపై వచ్చిన ప్రశ్నలేంటి?

ఇరాన్ యుద్ధనౌకపై దాడి విషయంలో దేశంలోని విపక్ష నేతలు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో, “ఈ ఇరానియన్ నావికులు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌ వచ్చారు. మనం వారిని ఆహ్వానించాం. వాళ్లు మన అతిథులు. వారు తిరిగివెళ్తుండగా, అమెరికా సబ్‌మెరైన్ వారి నౌకపై దాడి చేసి, వారిని చంపేసింది” అని రాశారు. “ఇంత జరిగినా, ప్రధాని మోదీ నుంచి కనీసం స్పందన లేదు. ఈ పిరికితనం ఆమోదయోగ్యం కాదు. ప్రధాని మోదీ ఇలా రాజీపడడం దేశాన్ని ఇబ్బందిపెడుతోంది” అని ఆమె అందులో రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ఇరాన్ ఓడకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ ఘటనపై స్పందించారు. “ఈ వీడియో మోదీ పిరికితనాన్ని ఎత్తిచూపుతోంది. భారత్ ఆహ్వానం మేరకు ఇరాన్ ‘మిలాన్ ఎక్సర్‌సైజ్ 2026’ కోసం తన నౌకను పంపింది. ఈ ఓడ ప్రత్యేకతలను రాష్ట్రపతికి వివరించారు కూడా” అని రాశారు. “ఈ ఓడను అమెరికా పేల్చివేసింది. ఈ ఘటనలో 100 మందికిపైగా నావికులు చనిపోయారు. మన అతిథులు చనిపోయారు, కానీ మోదీ మౌనంగా ఉన్నారు” అని ఆయన రాశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870