శక్తికి మించిన సహకారం కానీ, సహాయం కానీ చివరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుచేయ డం అంత మంచిది కాదంటారు. మోయలేని భారం (Unbearable burden) తలకెత్తుకుంటే మొదటికే మోసం వస్తుం దన్న విషయం విస్మరించకూడదు. ఏదో ఒకటి, రెండు సందర్భా ల్లో అయితే అర్థం చేసుకోవచ్చు. అభినందించవచ్చు. కానీ అదేపనిగా ఆర్థికపరిస్థితి అర్థం చేసుకోకుండా అందిన కాడికి అప్పులు తెచ్చి ఖర్చుపెడుతూ, అది వ్యక్తి కి కానీ, సంస్థకుకానీ, ప్రభుత్వానికి కానీ ఒకనాటికి చేతు లెత్తని తప్పని పరిస్థితులు ఏర్పడక తప్పదు. దివాలా బాట పట్టాల్సిందే. ఇదేమీ కొత్త విషయం కాదు. అందరికి తెలిసిందే. ఎన్నో సంస్థలు, వ్యక్తులు, ఒకనాడు ఎంతో దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనా వస్థకు చేరు కున్న ఉదాహరణలు కోకొల్లలు. ఆస్తులు అమ్ముకోవడం ది\ వాలాకు సంకేతం. అవి కూడా ఆవిరి అయిపోయిన తర్వాత చివరి అంకమే దివాలా. దివాలా అనేది వ్యక్తి విషయంలో తీవ్రంగా పరిగణిస్తారు. ఒక రకంగా సమాజం బహిష్కరించినట్లే చూస్తుంది. దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలు సైతం చేపడు తున్న కార్యక్రమాలు, వెచ్చిస్తున్న నిధులు, ప్రధానంగా ఉచితాలతో వస్తున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తే ప్రభుత్వాలు ఆ బాటవైపు పయనిస్తున్నాయేమోనని పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం విద్యుత్ విషయంలో పేద, ధనిక, అందరికి ఉచితంగా ఇస్తామని ప్రకటించడం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పిట్టను కొట్టా పొయ్యిలో పెట్ట అన్నట్లుగా ఉంది. జీత భత్యాలకే వెతుకులాడు కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలుగురాష్ట్రాల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయే మోననిపిస్తున్నది. అయినా ఇష్టానుసారంగా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇలా ఎంతకాలంకొనసాగిస్తారు. అప్పు పుట్టని పరిస్థితే వస్తే ఏం చేస్తారు? ఇటీవల శ్రీలంకలో పరిస్థితి ఏమైందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశం ఆర్థికసంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నది.
Read Also : Fuel Crisis in India: యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

ప్రతి అవసరానికి అప్పుల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి చాలారాష్ట్రాల్లో కన్పిస్తు న్నది. మనది సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమా లు చేపట్టాల్సిందే. దారి ద్ర్యరేఖకు దిగువనున్న లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాలకు చేయూతనివ్వాల్సిందే. వారికి అన్నిరకాల సహకారం అందించాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావులేదు. ప్రజాస్వామ్యవాదులు ఎవరూ దీనిని వ్యతిరేకించలేరు కూడా. కానీ వారి పేరు మీద జరుగుతున్న దోపిడీ మాటేమిటి? వారిని చూపి అనర్హులకు కోట్లాది రూపాయలు అప్పగించడం ఎంతవరకు సమంజసం? వేలాది కోట్ల రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్న డబ్బులు ఇలా దుర్వినియో గం చేయడం ఎంతవరకు న్యాయమో పాలకులు ఆలో చించాలి. భారతదేశానికి సంబంధించి పేదరికాన్ని నిర్మూలించేందుకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించారు, వెచ్చిస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కోట్లాది కుటుంబాలను ఆదు కొని వారిని ఆ దుర్భర జీవితాల నుంచి గట్టెక్కించామని అంకెలతోసహా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారు ఇరవైశాతానికి మించ రని గ్రామీణాభివృద్ధి శాఖ చెప్పుకుంటున్నది. ఇందుకు విరుద్ధంగా పెరుగుతున్న తెల్లకార్డుల సంఖ్య చూస్తే విస్తు పోవాల్సి వస్తున్నది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రా ల్లోనూ ఊహకందని విధంగా తెల్లకార్డులు పెరిగిపోతున్నాయి. కొన్నిరాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు తెల్లకార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే దారిద్య్రరేఖకు దిగువనున్న వారిసంఖ్య దాదాపుఎనభై శాతం ఉన్నట్లు అర్థం అవుతున్నది.

అటు గ్రామీణాభివృద్ధి శాఖ చెబుతున్న లెక్కలుకానీ ఇటు పౌరసరఫరా శాఖలెక్కలు కానీ రెండూ రికార్డుల ప్రకారంవెల్లడిస్తున్నాయి. ఇందులో ఏదసత్యం? ఏది అసత్యం అన్నది పాలకులకు తెలియంది కాదు. నిరుపేదల నోటికాడి సబ్సిడీ బియ్యాన్ని భోంచేయడానికితెల్లకార్డుల రూపంలో కోట్లాది మంది అర్హతలేనివారెందరో పుట్టుకువస్తున్నారు. కొందరు డీలర్లు చేస్తున్న మాయాజాలంతో కూడా ఈ కార్డులు పెరుగుతున్నాయి. అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. వీరి ఆట కట్టించలేని దౌర్భాగ్యపరిస్థితి. ఒక్క రేషన్కార్డుల్లోనే కాదు, ప్రతికార్య క్రమంలోనూ అనర్హులు, దళారులు పెరిగిపోతున్నారు. ఇది వారి హక్కుగా భావిస్తున్నారు. అధికారులకు దళారులను నిరోధించలేని నిస్సహాయకస్థితి. అటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ, మరే ఇతర పథకాల్లో కానీచివరకు ప్రాజెక్టుల నిర్మాణంలోకూడా జరుగుతున్న దోపిడీ అంతా ఇంతాకాదు. ప్రజాసేవ కోసమే ప్రజ ప్రతినిధులుగా ఎన్ని కైన కొందరు నేతలు పర్సెం టేజీని బాహాటంగానే తీసు కుంటున్నారు. ఏ ప్రాంతంలో ఏమేరకు కాంట్రాక్టుల వద్ద పర్సెంటేజీలు
తీసుకుంటున్నారో బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పాలకులు తన ఆర్థిక విధానాలనై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయా ల ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్న పథకాల విష యంలో ప్రభుత్వం పునరాలోచించాలి. అప్పులు చేయ డం కంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనినిర్మాణా త్మక కార్యక్రమాలు చేపట్టి అవినీతి నియంత్రిస్తే తప్ప ఎన్నివేల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలపై భారం(Unbearable burden) వేసి పన్నుల రూపంలో ఎన్ని నిధులు వసూలు చేసినా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు లేవు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: