हिन्दी | Epaper

The courts: న్యాయస్థానాల్లో సిటిజన్స్ చార్టర్ అవసరం

Sudha
The courts: న్యాయస్థానాల్లో సిటిజన్స్ చార్టర్ అవసరం

కక్షిదారులకు ఉచిత న్యాయ సేవలు, సహాయం అందుబాటు లోకి తేవాలనే సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో సవరణలు చేసి న్యాయసేవల అధి కారిక చట్టం, 1987ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని ప్రస్తుతానికి దేశంలోని అన్నిరాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతు లు, స్త్రీలు, చట్టంలో సూచించబడిన ఇతర బీద, బలహీన వర్గాల వారు ఉచిత న్యాయసేవలు, సహాయానికి అర్హులు. కేసు దాఖలు నుండి తీర్పు ప్రతులు పొందే వరకు అన్ని సేవలు వీరికి ఉచితంగా అందించబడ తాయి. ఉచిత న్యాయసేవలు, సహాయం గురించి దాదాపు ప్రతి కోర్టుల సముదాయంలో ప్రకటనలు, కరపత్రాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇదంతా ఒక పార్శ్వమయితే, సత్వర నాణ్యమైన న్యాయం కోసం కక్షిదారులు అర్రులు చాస్తు న్నారనేది కాదనలేని నిజం. కేసు తుది అంకానికి చేరుకో డానికి సంవత్సరాలు గడిస్తే, వాదనలు విన్న పిదప తీర్పు వెలువరించడానికి కొన్ని నెలలు తీసుకుంటున్నారని, ఆపై తీర్పు లేదా ఉత్తర్వు ప్రతులు అందించటానికి కొన్ని వారాలు పడుతుందని, ఇన్ని అసౌకర్యాల మధ్య గెలిచిన వాడు, ఓడినవాడు ఇరువురు అసంతృప్తితో ఉన్నారనేది కూడా నగ్నసత్యం. సుప్రీంకోర్టు తమ తీర్పుల ద్వారా హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పు వెలువరించటానికి గరిష్ట కాలపరిమితి విధిస్తూ చాలా సార్లు మార్గదర్శకాలు జారీ చేసింది. దిగువ కోర్టు (the courts)న్యాయమూర్తులు తుది వాదనలు విన్న నాటి నుండి సివిల్ కేసుల్లో 60 రోజులకు మించ కుండా, క్రిమినల్ కేసుల్లో 45 రోజులకుమించకుండా తీర్పు లేదా ఉత్తర్వు వెలువరించాలని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ నిబంధనలను కొంతమంది న్యాయమూర్తులు సక్రమంగా పాటించకపోవడంతో కక్షిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

Read Also : Tirumala Laddu controversy: తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

The courts
The courts

తీర్పులు ఒక నిర్దిష్ట సమయంలో వెలు వరించాలనే సుప్రీంకోర్టు తీర్పులు, సంబంధిత చట్టాలు చెబుతున్నాయనే విష యం చాలా మందిసాధా రణప్రజానీ కానికి తెలి యదు. నిర్ణీత సమ యంలో తీర్పు వెలువరించ నట్లయితే సంబంధిత న్యాయమూర్తిని ప్రశ్నిస్తే కోర్టుధిక్కారం అవుతుందేమో లేక తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందేమో అనే జంకు సహజంగా కక్షి దారుల్లో ఉంటుంది. ఇటువంటి అపోహను తొలగించి కక్షిదారులకు న్యాయస్థానాలపై నమ్మకం, మరింత గౌరవం పెరగాలంటే, న్యాయస్థానాల్లో పార దర్శకత, జవాబుదారీ విధానాన్ని కల్పించాలంటే ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఉన్నత న్యాయవ్యవస్థ కొన్ని చర్యలు సత్వరమే చేపట్టవల సిన అవసరం ఉంది. ముఖ్యంగా పౌర సేవలు అందించే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తు న్నట్లు సిటిజన్స్ చార్టర్న్యా యస్థానాల్లో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుం ది. అంటే ఇది సేవల ప్రమాణాలు కాల పరిమితులకు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తుంది. సివిల్దావా, అప్పీ లు దావా, క్రిమినల్ కేసుల్లో చార్జిషీటు, ప్రైవేటు ఫిర్యాదు, క్రిమినల్ అప్పీలు మొదలగు వాటిని దాఖలు చేసిన నాటి నుండి కోర్టులు రిజిస్ట్రేషనక్కు తీసుకునేగరిష్ట కాలపరిమితి, తీర్పు లేదా ఉత్తర్వు వెలువరించటానికి హైకోర్టుకు సుప్రీం కోర్టు నిర్దేశించిన గరిష్ట కాలపరిమితి, దిగువ కోర్టులకు తీర్పులు వెలువరించటానికి చట్టాలు నిర్దే శించిన నిర్దిష్ట కాలపరిమితి, ఉచిత తీర్పు ప్రతులు జారీ చేయడానికి గరిష్ట కాలపరిమితి, డాక్యుమెంట్లు, ఇతర ఉత్తర్వుల నకళ్ళు ఖర్చు లతో జారీ చేయటానికి తీసుకునే గరిష్ట కాలపరిమితి తెలి యజేసే ఒక నియమావళిని బహిర్గతం చేస్తూ పారదర్శకత కోసం హైకోర్టు, దిగువకోర్టుల్లో ప్రస్ఫు టంగా అందరికీ కనిపించే ప్రదేశంలో సిటిజన్స్ చార్టర్ లాంటి కాలపట్టిక ప్రదర్శించాలి. అదే రీతిలో ప్రతి కోర్టులో పెండింగులో ఉన్నటువంటి కేసుల సంఖ్య, పరిష్కరించబడి నటువంటి కేసుల సంఖ్య, కేటగిరి వారీగా, సంవత్సరం వారీగా ప్రతి మూడు లేదా ఆరు నెలలకోసారి ప్రదర్శించాలి. దానివల్లపాత, క్రొత్త కేసుల సంఖ్యా వివరాలు న్యాయవాదులకు, కక్షిదారులకు తెలియడమే కాకుండా పాత కేసులు పరిష్కారా నికి కోర్టు ప్రాధాన్యత నిస్తుందనే విష యం వారికి బోధప డ్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కక్షిదారులకు సకాలం లో నాణ్యమైన సేవలు అందించే సంస్కరణలు రూపు దిద్దు కునే అవకాశం
లేకపోలేదు. ఎప్పుడైతే కక్షిదారులకు నిబం ధనల గురించి పరిజ్ఞానం ఉంటుందో, న్యాయ స్థానాలు (the courts)కూడా జవాబుదారీ తనంతో వ్యవహరిస్తాయి. ఈ కార్యానికి సంబంధిత కోర్టు చర్యలు తీసుకునే విధంగా ఉన్నత న్యాయస్థానాలు మార్గదర్శకాలు జారీ చేయాలి.
-తడకమళ్ళ మురళీధర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870