వాస్తే మాజీవితం.. జ్యోతి ష్యమే మా ప్రాణం.. ఆ రెండు లేకుండా మేము బతకలేం. మేము చేసే ప్రతి పనికి ఆ శాస్త్రాల సహకారం అవసరం. వాస్తు జ్యోతిష్య పండితులు చెప్పిన్నట్లుగా, వింటాం, నడుచుకుం టాం, అమలు చేస్తాం, ప్రాణాలను కూడా త్యాగం చేస్తాం. గత కొన్నే ళ్ల నుంచి వాస్తు జ్యోతిష్య ప్రభా వం వలనే ఎన్నికలలో విజయంసాధించాం, మంత్రుల పదవులు చేపట్టాం, కోట్లకు పడగలె త్తాం, దీనిని బట్టి వాస్తు, జ్యోతిష్య వలలో ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు ఏ విధంగా చిక్కుకుపోయి ఉన్నారో స్పష్టం అవుతుంది. ఆశాస్త్రాల ప్రభావం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు, లక్ష్మీదేవిని ఇంట్లో భద్రపర్చుకోవచ్చు, ఊహించని పదవులు, ప్రమోషన్లు చేపట్టవచ్చు అంటూసామాన్యులు, డబ్బున్న వాళ్లు, చిన్న ఉద్యోగి మొదలుకొని ఉన్నత పదవులలో ఉన్నఅధికారులు పేర్కొంటున్నారు. ఆ శాస్త్రాలను వారు గాఢంగా విశ్వసిస్తున్నారు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం వంటివి శాస్త్రాలు అవునో? కాదో? కాని వాటిని నమ్మే ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఉన్నారు. బ్రహ్మరాత చదవటం ఎవరికీ సాధ్యం కాదని ప్రతి ఒక్కరు పేరొ్కంటు న్నప్పటికీ జ్యోతిష్యశాస్త్ర పండితులు మాత్రం సునాయాసంగా చదివి భూతభవిష్యత్తు వర్తమానాలను ఇట్టే చెబుతామంటూ చేస్తున్న దానిలో వాస్తవం ఉందని ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు, శాసనసభ్యులు ఎక్కు వగా విశ్వసిస్తున్నారు. వాస్తు బలంగా ఉంటేనే విజయం సాధిస్తాం, కీలకమైన పదవులు వరిస్తాయి. జ్యోతిష్య (Astrology)పండితులు చెప్పినవన్నీ తూ.చా తప్పకుండా పాటిస్తే తిరుగు ఉండదు, ఎదురు ఉండదు. నామినేషన్ మొదలు ప్రచారం ప్రారంభం వరకు వాస్తు, జ్యోతిష పండితులు చెప్పినవన్నీ జగ్రత్తగా పాటిస్తున్నారు.
Read Also : Maoist Free India: మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

గెలవడానికి వాస్తుసహకరించక పోతే ఎన్నికోట్లు ఖర్చుచేసినా ఫలితం ఉండదని మూర్ఖంగా ప్రతినిధులు నమ్ముతున్నారంటే వాస్తు, జ్యోతిష్య (Astrology) ప్రభావంఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. గతంలో వాస్తు, జ్యోతి ష్యాన్ని విమర్శించిన వారే ఆ శాస్త్రాలను నమ్ముతుండడటం గమనార్హం. ఎలాంటి శాస్త్రాలను పాటించని విద్యావంతులైన ముస్లింలు వాస్తును పాటించడం విశేషం. ఉత్తరభారతంలోనే కాకుండా, దక్షిణ భారతంలో ఉండే పేరున్న బడానాయ కులు ఆస్తిపాస్తులు పెంపొందించుకోవడానికి ఉన్నత హోదాలు చేజిక్కించుకోవడం కోసం వాస్తును పాటిస్తూనే, జ్యోతిష్య పండితులు చెప్పిన్నట్లుగా యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలతో నిర్మించుకున్న భవనానికి వాస్తు లేదు, ఏవీ కలిసి రావు అని చెబితే వెంటనే వాటిని కూల్చివేసి వాస్తు పండితులు చెప్పిన్నట్లుగా తిరిగి నిర్మించడానికి లక్షలుఖర్చు చేస్తున్నారు. వాస్తుప్రకారం ఎన్నికల కార్యాలయం భవనా లను నిర్మిస్తున్నారు. ఉత్తరంలో కూర్చోని ఉత్తరం రాయాలి, దక్షిణంలో ఉండి దానం చేయాలి, పడమటి నుంచి పందెం కాయాలి, తూర్పులో నిలబడి దండెం పెట్టాలి అని పండిం తులు చెబితే వెంటనే నాయకులుఅమలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో అన్న విషయాన్ని కూడా ఆలోచించడం లేదంటే ఆ నాయకులు వాస్తు, జ్యోతిష్య ఊబిలో ఏ స్థాయిలో దిగబడిపోయి ఉన్నారో అర్థం అవుతుంది. 2023 తెలంగాణాలో, 2024ఆంధ్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాస్తు, జ్యోతిష్యం సరిగా లేక వక్ర చూపుతో చూడటం వలనే ఓడిపోయాం, శాస్త్రాలన్నిటిని సరిచేసుకొని 2029లో జరిగే ఎన్నికల రణంలోకి దిగి విజయం సాధిస్తాం అని కొంతమంది ఒడిపోయిన శాసనసభ్యులు బహిరంగంగా పేర్కోవడాన్ని బట్టి వారు ఏస్థాయిలో ఆ శాస్త్రాలను నమ్ము తున్నారో స్పష్టం అవుతుంది. దేశంలో 90శాతం మంది పార్టీ అధినేతలు, కీలకమైన నాయకులు వాస్తు, జ్యోతిష్యాన్ని నమ్ముకొని 2029లో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో దిగి కోట్లు ఖర్చు చేయాలనీ నిర్ణయించుకొన్నారు. వీరిలో ఎంతమంది గెలుస్తారో వేచి చూడాలి. ఎన్నికల లో విజయం సాధించడానికి, క్షుద్రపూజలు చేయించే నాయ కులు లేకపోలేదు. కానీ దేశంలో అలాంటి వారి శాతంచాలా తక్కువ. ఈ క్షుద్ర వ్యవహారాన్ని అతి రహస్యంగా నిర్వహి స్తారు. గతంలో కొంతమంది నాయకులు క్షుద్రపూజలు చేయి స్తున్నారని ఆరోపణలు చేసినా వారు సరైన సాక్ష్యాలు, ఆధా రాలు చూపకపోవడంతో ఆ విమర్శలకు అడ్డు తెరపడింది.

వాస్తు ప్రకారం ఢిల్లీలో 2023 సంవత్సరం మే నెలలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకముందు పాత పార్లమెంటు భవనం ప్రభావం వలన ప్రభుత్వాలుసుస్థిరంగా మనుగడ సాగించలేకపోతున్నాయంటూ ఇండోర్లో జరిగిన ఒక సదస్సులో కొందరు వాస్తు పండితులు పేర్కొ న్నారు. న్యూఢిల్లీ పాత పార్లమెంటు భవనాన్ని నిర్మించిన తీరు, ఉపయోగించిన రంగులు, భవనంలోకి వచ్చే గాలిని బట్టి ఏపార్టీ అయినా కేంద్ర పీఠాన్ని చేజిక్కించుకున్నా ఫలితం పెద్దగా చూపలేవని వాస్తు పండితులు స్పష్టంచేసారు. పార్లమెంటు భవనంలోకి వచ్చే దిశను మార్చడంతోపాటు, మరికొన్ని మార్పులు చేస్తే వాస్తుదోషాలు ఉండవని పండి తులు చెప్పారు. భవనానికి వేసిన రంగులు మార్చాలని, పార్లమెంటులో వేసిన కార్పెట్లపైన నడవటం మంచిదికాదు. ‘పాలరాళ్లను పరిపించాలని కూడా వాస్తు పండితులు స్పష్టం చేసారు. వాస్తుసరిలేకపోవడం వలనే గతంలో అస్థిర ప్రభు త్వాలు అధికారం చేపట్టాయి. ఒకవేళ పూర్తి అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం ఆ తర్వాతజరిగే ఎన్నికలలో పరాజ యం పాలవుతుందని, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు, కొన్నిపార్టీలు కలిసి కలగూర గంపలాంటి ప్రభుత్వాలు ఏర్పా టు చేసినా మధ్యలోనే అభిప్రాయ భేదాలొచేస్తాయి. కొమ్ము కాసిన పార్టీయే ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు చేస్తాయని పండితులు వివరించారు. దేశంలోని మహా నగ రాలలో నివసిస్తున్న వారికివాస్తుశాస్త్రం పై వివరీతంగా నమ్మకం పెరిగిపోయింది. సామాన్యుడిని మొదలుకొని ధన వంతుడు వరకు, చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న అధికారి వరకు వాస్తుమైకంలో కూరుకుపోయి ఉన్నా రు. అద్దెఇళ్లలో వుండటానికి నివాసులు వాస్తునే దృష్టిలో పెట్టుకోవడం విశేషం. వాస్తును నమ్ముకున్న మధ్యతరగతి కుటుంబాలు వాస్తు సరిగ్గాలేదని పండితులు చెబితే వెంటనే లక్షల్లో నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేసేస్తున్నారు. మధ్య తరగతికి చెందిన వారు అద్దెఇళ్లలో ఉండి వేల రూపాయలు చెల్లించేదానికన్నా సొంత ఇళ్లునిర్మించుకోవాలని నిర్ణయించు కొని, గృహప్రవేశాన్ని ఆర్భాటంగా పూర్తి చేసి, సంతోషంతో ఊపిరి పీల్చుకున్నకొద్ది రోజులలోనే వాస్తుపండితులుజోక్యం చేసుకొని ఇదేమిటయ్యా ఈశాన్య మూల ఖాళీగా వుంచాలి. ఇక్కడ గది ఉండకూడదు, వెంటనే కూలగొట్టు, వెంటనే ఈ గుమ్మం మార్పించు, మీకు తెలిసిన వారు సరిగా వాస్తు గురించి చెప్పలేదు. అని ఆయా ఆసాముల ‘మైండును’ పండి తులు పాడు చేసి వెళ్ళిపోతున్నారు. భయ పడి పోయిన కొంతమంది ఇళ్ల యజమానులు లక్షలు ఖర్చుచేసి నిర్మించిన ఇళ్లను మరమ్మత్తులుచేసి చివరకు చూస్తే గోడలు, పైకప్పు మాత్రమే మిగిలిపోతున్నాయి. ఇల్లు కట్టడమంటే అన్ని తిరకా సులే. కనుకనే పెద్దలు ఇల్లుకట్టడాన్ని పెళ్ళితో పోల్చారు. గతంలో పాలకులు నగర నిర్మాణాలు కావించేటప్పుడు కూడా వాస్తు శాస్త్ర సమ్మతంగానే ఆ పనులు నిర్వహించేవారు. అప్పుడు వెలసిన నగరాలు ఒక పద్ధతి లో చూడముచ్చటగా వుండేవి. ఇప్పుడానగరాల రూపురేఖ లు మారిపోయాయి.
-ఎం.నారాయణ స్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: