हिन्दी | Epaper

Rahul Gandhi : ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

Sudha
Rahul Gandhi : ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత భారీ స్థాయిలో ఉంటే, గృహ వినియోగదారులకు కూడా తగిన స్థాయిలో సిలిండర్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది. గురువారం ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు దీనిపై నిరసన చేపట్టారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో చమురు కొరతపై కేంద్రం త్వరగా స్పందించాలి. సంక్షోభంగా మారకముందే మేల్కోవాలి. కేంద్ర విదేశాంగ విధానం మారాలి. దేశంలో గ్యాస్ ఒక ప్రాబ్లం. చమురు ఒక ప్రాబ్లం. పెట్రోల్ ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇంధన భద్రతలో రాజీపడ్డాం. లోపాలతో కూడిన విదేశాంగ విధానమే ఇందుకు కారణం. చమురు సమస్యపై ముందు జాగ్రత్త అవసరం. ప్రధాన మంత్రి, ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించాలి. ప్రజలపై భారం పడకుండా చూడాలి. నేను ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి ఒక విధానం ఉంటుంది.

Read Also : IOCL: పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

Rahul Gandhi
Rahul Gandhi

ఎల్పీజీ, గ్యాస్, ఆయిల్‌ సమస్యపై నేను మాట్లాడాలి. కానీ, ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కొత్త విధానం తీసుకొచ్చారు. ముందుగా దీనిపై మంత్రి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత నేను మాట్లాడుతా. ఆ తర్వాత మంత్రి సమాధానం ఇస్తారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నిరసనలో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, టీఎంసీ, ఎస్పీ సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా దేశంలో చమురు కొరతపై వంట స్టవ్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870