రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని మాస్కోకు రష్యా ఆహ్వానించింది. నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో శాంతికి ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు దేశాలు పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడానికి అంగీకరించాయనే ప్రచారంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత క్రెమ్లిన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
Read Also: Actor: సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

రష్యా, ఉక్రేయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు
అమెరికా మధ్యవర్తిత్వంతో గత వారాంతం అబుదాబిలో జరిగిన చర్చలు శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయి. కానీ, రష్యా, ఉక్రేయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. భీకర పోరాటం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఇటీవలి రష్యా క్షిపణి దాడుల వల్ల ధ్వంసమైన విద్యుత్తు వ్యవస్థ అంతరాయాలతో కీవ్ పోరాడుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ , వ్లాదిమిర్ పుతిన్(Putin)లు సమావేశానికి సిద్ధంగా ఉన్నారని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అమెరికా అధికారి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: