జనారోగ్యమే జాతి మహాభాగ్యమనే లక్ష్యంతో దేశ ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేందుకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, చేస్తూనే ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లెక్కలేనన్ని పథకాలు ప్రవేశ పెట్టారు. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రజారోగ్యం విష యంలో పాలకులు తీసుకోవాల్సిన చర్యల గూర్చి రాజ్యాం గంలోపొందు పరిచారు. ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా అందరికి కనీస ఆరోగ్య వసతులు కల్పించడంలో పాల కులు విఫలమయ్యారనే చెప్పొచ్చు. ప్రజారోగ్యంపై (public health)దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కొన్ని వ్యాధులను నియంత్రించడం డాక్టర్లకు కూడా సాధ్యం కావడం లేదు. కొత్త మందులు, చికిత్సలు, అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా అంతకు రెట్టింపు స్థాయిలో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. కోట్లాది మంది రోగపీడితులు అవుతున్నారు. లక్షలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా రక్కసి శాంతించినా అప్పు డు వాడిన మందుల ప్రభావం నుండి ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కోలుకోలేకపోతున్నారు. కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. డయాలసిస్ కేంద్రాలు ఎన్ని పెట్టినా సరిపోవడంలేదు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోయాయి. వయస్సుతో నిమిత్తంలేకుండా ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న చిన్నపిల్లల నుండి అరవై యేళ్లకు పైబడిన వారు గుండెజబ్బులకు లోనవుతున్నారు. ఆకస్మికంగా ఉన్న చోటనే కూలిపోయి క్షణాల్లో ప్రాణాలు వదులుతున్నారు. ఇక దోమల ద్వారా వస్తున్న వ్యాధులు అన్నీఇన్నీ కావు. గతంలో వచ్చిన స్వైన్ఫ్లూ, ఎబోలా, డెంగ్యూ, చికెన్గున్యా, ఒకటే మిటిరకరకాల విషజ్వరాలు విస్తరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తి ఉన్నవారు బయటపడే అవకాశా లున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Bangalore: కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

ఒక్క అల్లోపతి డాక్టర్లే కాదు, ఆయుర్వేదం, హోమియో తదితర విభా గాల డాక్టర్లు, వైద్య నిపుణులు, శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఈవిషయం ఇప్పు డు కొత్తగా చెప్పడం లేదు. ఏనాటి నుంచో చెప్తున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు కూడా తెలియనివికావు. అయినా రోగనిరోధక శక్తి ఎందుకు పెంచుకోలేకపోతున్నారు. కార ణాలు ఏమిటి? కారకులు ఎవరు? తదితర అంశాలు పరిశీలించాల్సిన తరుణమిది. రోగనిరోధక శక్తి ఒక్క రోజులో పెరిగేది కాదు. బాల్యం నుంచి సమతుల్యమైన పోషక విలువలు కలిగిన పోష్టికాహారాన్ని అందించాలి. ఏమేరకు అందిస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పౌష్టికాహార లోపంతో ప్రధానంగా నిరుపేదలు అల్లాడిపోతున్నారు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు. అర్థాకలితో అలమటించే వారు భారత్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో రోగ నిరోధకశక్తి ఎలా వస్తుంది. మరొకపక్క వాయు, నీటి కాలుష్యాలు ప్రజారోగ్యాన్ని కోలుకోలేకుండా చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు దాదాపు కాగితాలకే పరిమిత మవుతున్నాయి. మొన్న దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరుకోవడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఢిల్లీపరిసర ప్రాంతాల్లో ప్రధానంగా చలికాలం, వాయుకాలుష్యం చుట్టుముట్టడం, ఆ పౌరులను ఉక్కిబిక్కిరి చేయడం ప్రతియేడాది జరుగుతూనే ఉన్నది. యేడా దియేడాదికి పెరిగిపోతున్నది. ఒక్క ఢిల్లీయేకాదు, భారత దేశంలోని అనేకనగరాలు, పట్టణాలు వాయుకాలుష్యం తో అతలాకుతలం అవుతున్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలుఅంతగా ఫలించడం లేదు. దీనికి తోడు వాహన కాలుష్యం పెరిగిపో తున్నది. ఫలితంగా కేన్సర్ లాంటి వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీని బారినపడి లక్షలాది మంది ఆర్థి కంగా చితికి పోతుంటే మరికొందరు సకాలంలో సరైన వైద్యం అందకప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

యేటా సరాసరి దేశంలో పధ్నాలుగు లక్షలకుపైగా కేన్సర్ కేసు లు నమోదవుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి జాతీయ కేన్సర్ నమోదు కార్యక్రమం నివేదికను బట్టి తెలుస్తున్నది. యాభై యేళ్లు వయసురాకముందే మహి ళలు, పురుషులు రకరకాల కేన్సర్ల బారిన పడుతుండటా నికి వారి జీవన శైలి, సంబంధిత అలవాట్లు ప్రధాన కారణమని పరిశోధకులు, వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. అలవాట్లను, జీవనశైలిని మార్పు చేసుకోవడం ద్వారా కేన్సర్ మహమ్మారిబారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని నిపు ణులుచెబుతున్నారు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడంవల్ల నోరు, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక కేన్సర్ల నుండి తప్పించుకోవచ్చునని డాక్టర్లు సలహా ఇస్తు న్నారు. అయితే ప్రజ ల్లో దీనిపై అవగాహన పెంచేందు కు త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు జరగడంలేదు. ఒక పక్క పొగాకు సాగును ప్రోత్సహిస్తూనే మరొకపక్క నియంత్రిం చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మద్య పానంకూడా ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నది. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకునే పాలక పెద్దలు ఆప్రజారోగ్యా న్ని పణంగా పెట్టి ధనార్జన చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇవేకాదు కల్తీ కూడా ప్రజారోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తున్నది. ఇలాంటివి ఎన్నో ప్రజారో గ్యాన్ని (public health)పతనం అంచుకు తీసుకుపోతున్నాయి. పాలకులు ఇప్పటికైనా మనస్సు పెట్టి ఆలోచించాలి. పెరుగుతున్న అవ సరాలకు అనుగుణంగా ఆస్పత్రులను, సిబ్బందిని పెంచి వైద్యసదుపాయాలు అందించాల్సిన అవసరం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: