పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధజ్వాల ప్రపం చానికే విపత్తు తెచ్చిపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కేవలం ‘అణు’మానంతోనే ఇరాన్పై యుద్ధానికి దిగిందన్నది తేటతెల్లమే. ఎవరూ ఓ మెట్టు దిగేందుకు సిద్ధంగా లేరు. దేశాల మధ్య పోరు ఏర్పడితే ఆది ఆయా దేశాల పౌరులకూ, సైన్యానికీ మరణ శాసనమేనన్న విషయం తెలియనిది కాదు. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు అటు అగ్ర రాజ్యానికీ, ఎన్నో కొన్ని ఇటు ఇరాన్వైపు మద్దతు ప్రకటించారే తప్ప మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చేవారే లేరు. ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తోందన్న అనుమానమే అమెరికా అఘాయిత్యానికి కారణం. ఇరాన్ అణ్వాయు ధాలను సమకూర్చుకుంటే తమకు ఎప్పటికైనా నష్టమే నన్న ధోరణిలో ఇజ్రాయెల్ అమెరికాను ఎగదోసి యుద్ధం వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఇరు దేశాల్లోను మంటలు
మింటికెగిసాయి. కాగా యుద్ధ ప్రభావం దాదాపు అన్ని దేశాలపైనా ఉంది. యుద్ధానికి ఎవరు కాలుదువ్వినా, కారణమేదైనా, దాని పర్యవసానం ఎంతో విస్తృతంగా ఉంటుంది. భారతీయ సమాజానికి ఈ యుద్ధం వల్ల పరోక్షంగా అగచాట్లు తప్పేటట్లు లేవు. గత యేడాది పాకి స్థాన్తో యుద్ధాన్ని చేసినప్పుడు కూడా రాని సమస్యలు భారత్కు ఇప్పుడొచ్చాయి. ఇతర దేశాల మధ్య అందున ఈ యుద్ధం వారితో వాణిజ్య, వ్యాపార సంబం ధాలు దృఢంగా ఉన్న సమయంలో వెల్లువెత్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక స్థితిపై భారీగా ప్రభావంచూపుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం హఠాత్పరి ణామం ఆయా యుద్ధ ప్రభావమున్న దేశాల్లో ఇరుక్కు పోయినదాదాపు కోటి మంది భారతీయులపై ప్రత్యక్ష ప్రభావముంటే, భారతదేశ ప్రజలపై పరోక్ష ప్రభావం పడుతోంది. ప్రధాన సమస్య. ‘ఆర్థికం’ అతలాకుతలం.
Read Also : Samsung Galaxy: భారీగా పెరగనున్న గెలాక్సీ A57, A37 ధరలు!

దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమనంలో ఉండి లక్ష్యాలు నిర్దేశించుకున్న వేళ తాజా యుద్ధ ప్రభావాన్ని విశ్లేషంచుకుంటే ఇటీవల యూరోపియన్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, తదితర దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆలస్యమయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువుల రవాణా రుసుం అధికమై ధరలు బాగా పెరిగిపోతాయి. ఇండియా నుంచి ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడతాయి. యుద్ధ మంటే ఏదో రెండు దేశాల కూటమి సైన్యాల మధ్య జరిగే పోరాటమనుకుంటే అవివేకం. అది మానవ సమా జాన్ని వేధించే సమస్య. కేవలం పరిష్కారం లభించే అంశంమీద ఏర్పడిన సందేహాల చాటున మొదలైన యుద్ధం కనుక అనివార్యమే. కానీ సామ్రాజ్యవాదం మాటున ప్రేరేపితమైన వ్యవహారం కనుక ఇరు వర్గాలు సంయమనంతో ఆలోచించకపోవడం వలన ప్రపంచం నెత్తిన ఓ పిడుగులా పరిణమించింది. ఒకపక్క ఇరాన్ ఏవిధమైన అణ్వాయుధ పరీక్షలు తల పెట్టినట్లు లేదని రష్యా స్పష్టంగా చెప్పింది. మరోపక్క ఇరాన్ సార్వభౌ మాధికారాన్ని కాపాడుతామని చైనా నిర్ద్వంద్వంగా చెప్ప జూసింది. ఇతర అణ్వాయుధ దేశాల కు సైతంఇరాన్పై ఎలాంటి అనుమానమూ లేదు. అలాం టిది ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే ఆరోపణల నేపథ్యం లో యుద్ధం సాగి స్తోంది. ప్రధానంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్ అధీనంలో ఉన్నహర్మూజ్జ లసంధిద్వారా ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు సరఫరా అవుతుంది. ఈ యుద్ధ సమయా నికి ఆ జలసంధిలో 700 వాణిజ్య నౌకలున్నాయి. అవన్నీ ఇరాన్ కనుసన్నల్లోంచి బయటికి కదలజాలవు. ఇప్పుడదే జరిగింది. వాటి రక్షణకు అమెరికా ప్రత్యామ్నయ భద్రతా ఏర్పాట్లు చేసేందుకు నడుం బిగిం చినా అన్నంత తేలికకాదు. ఒకపక్క విధ్వంసకరక్షిపణులు, డ్రోన్లు వంటి అత్యాధునిక బాలిస్టిక్ ఆయుధ సామాగ్రి ఉండగా వాటిని ధ్వంసం చేయవచ్చునేమో కానీ ఇరాన్ పరిధి లోంచి అమెరికా బయటికి తీసుకురాలేరు.నౌకలన్నీ అక్కడే రోజుల తరబడి నిలిచిపోతే ఆ సరుకు అవసరమైన దేశాలు ప్రజోపకర వినియోగ దినుసులు కోసం ఇబ్బంది పడాల్సిందే. ఈలోగా ఆయా దేశాల్లో ఉన్న వినియోగ వస్తువులు, చమురు నిల్వలు అడుగింటే అవకాశముంది. లిక్విఫైడ్ నైట్రోజన్, పెట్రోలియం, గ్యాస్ లు కూడా బ్లాక్ మార్కెట్లోకి తరలివెళ్లినా ఆశ్చర్యపోనక్క ర్లేదు. ఇప్పటికే పొద్దుతిరుగుడు ధరలుతీవ్రంగా పెరిగాయి.

సోమవారం రాత్రికే ఇండియాలోని ఆయిల్స్ ధరల (Price ‘explosion) ను బాగా పెంచేశా రు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి (Price ‘explosion).రేపు జీతాలొచ్చాక వాటిని వివిధ అవసరాలకు సరిపెట్టుకోవడం కష్టతరమే. ఇంధన ఖర్చు లు పెరిగి వాహనసౌకర్యాలన్నిటిపైనా ఛార్జీలు పెరుగు తాయి. సరుకు రవాణాకు అధిక వ్యయమౌతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాణిజ్యవస్తువుల రవాణా ఖర్చు పెరిగిపోయి రిటెయిల్ ధరలు కూడా సామాన్య జనం తట్టుకో లేనంతగా తయారవుతాయి. ఈ యుద్ధ పర్యవసానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయి. జీవనవ్యయం పెరుగుతుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈయుద్ధంతో ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు చుక్కలంటుతాయి. దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపు
తుంది. గ్లోబల్ సౌత్ విదేశీ విధానాలపై, ఆయా దేశాల మధ్య వాణిజ్య ఒడంబడికల మీదప్రభావం పడుతుంది. చమురు ధరలు పెరిగితే భారతజిడిపిపై ప్రతికూల ప్రభా వం పడుతుందని నిపుణుల అంచనా. కొన్ని రంగాల్లో మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం ఆగినా భారతీయ వినియోగదారుల మీద పడిన దెబ్బను తేరుకోవడం ఇప్పట్లో జరిగే పనికాదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: