हिन्दी | Epaper

AI Summit Protest Case: నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

Vanipushpa
AI Summit Protest Case: నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో కృత్రిమ మేధపై స‌ద‌స్సు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ స‌ద‌స్సులో శుక్ర‌వారం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న(AI Summit Protest Case) చేప‌ట్టారు. పైదుస్తులు విప్పి ఆందోళ‌న‌కు దిగారు. అమెరికాతో జ‌రిగిన ట్రేడ్ డీల్‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భారత్‌ మండపం వద్ద చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Read Also: AI ImpactSummit: థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

 AI Summit Protest Case: Patiala Court rejects bail of accused
AI Summit Protest Case: Patiala Court rejects bail of accused

అయిదు రోజుల పోలీసు క‌స్ట‌డీలోకి

క్యూఆర్‌ కోడెడ్‌ పాసులను ఉపయోగించి ఏఐ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించిన సుమారు 10 మంది యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు హాల్‌ నంబర్‌ 5 లోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇవాళ పాటియాలా హౌజ్ కోర్టులో ఈ ఘ‌ట‌న‌పై వాద‌న‌లు జ‌రిగాయి. న‌లుగురు నిందితుల బెయిల్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. అరెస్టు అయిన వారిలో యూత్ కాంగ్రెస్ స‌భ్యులు కృష్ణ హ‌రి, కుంద‌ర్ యాద‌వ్‌, అజ‌య్ ఉన్నారు. న‌లుగురిని అయిదు రోజుల పోలీసు క‌స్ట‌డీలోకి పంపారు. ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ ఓ కుట్ర ప్ర‌కారం నిర‌స‌న చేప‌ట్టిన‌ట్లు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు ఆరోపించారు. దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్ యువ‌త‌ను వాడుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.ఇంత క‌న్నా సిగ్గుమాలిన చ‌ర్య ఏమైనా ఉంటుందా అని ప్ర‌శ్నించారు. దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం ఎప్పుడు ఆపేస్తార‌ని మంత్రి రిజిజు ప్ర‌శ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870