हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

salary: శ్రమ ఆధారిత వేతనం అవసరం!

Sudha
salary: శ్రమ ఆధారిత వేతనం అవసరం!

ప్రభుత్వ ఉద్యోగ సాకారం ఒక కళ. ప్రభుత్వ ఉద్యోగం ప్రజా సేవ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ప్రభు త్వ ఉద్యోగులు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సవ్యంగా ప్రజలకు చేరవేయడం అలాగే ప్రభుత్వ సేవలను నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగుల విధి. దీనికి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా నుండి వారికి వేతనం (salary) ఇస్తుంది. పెరుగు తున్న ఖర్చులకు అనుగుణంగా ఆరునెలలకు ఒకసారికరువు భత్యం ప్రతిఏడాదికి వార్షిక ఇంక్రిమెంట్ ఉద్యోగులకు అంది స్తుంది. వీటితో పాటు పెరుగుతున్న జీవన వ్యయం ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల కొనుగోలు సామర్థ్యం పెంచి ఆర్థిక స్థితి మెరుగుపర్చడానికి ప్రతి 5 లేదా 10సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం దాదాపు 6000 కోట్లు ప్రతినెల వేతన (salary) రూపంలో ఉ
ద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రూపంలో చెల్లిస్తుంది. ఇటీవల విద్యుత్ శాఖలోని సీనియర్ స్వీపరుకు రెండు లక్షల జీతం అలాగే చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారికి 7లక్షల వరకు జీతం ఉందని16వ ఆర్థిక సంఘం సమావేశంలో జీత భత్యాలపై రాష్ట్ర ముఖ్యకార్యదర్శివర్యు లు చేసిన వాక్యలు దేశమంతటా అన్ని సామాజిక మాధ్య మాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవానికి విద్యుత్శాఖలో ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేస్తారు. అందరూ ఉద్యోగులతో పోలిస్తే విద్యుత్ ఉద్యోగుల విధి నిర్వహణ శైలి భిన్నం. ప్రస్తుత ఆధునిక యుగంలో మనిషి విద్యుత్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. మనిషి జీవనంలో సాధారణం నుండి అత్యవసరం వరకు విద్యుత్ ఆధారిత ఉపకరణాలు భాగమయ్యాయి. ప్రభుత్వం లోని అన్ని శాఖల సేవలు రోజు ప్రతి ఇంటిని ప్రతి రంగా న్ని అవసరం ఉంటుందో లేదో కానీ విద్యుత్ సేవలు మాత్రం అందరికీ అవసరం. నిరంతరం అందుబాటులో ఉంటాయి.
ఇలా గృహాల నుండి మొదలుకొని వ్యవసాయ వాణిజ్య పరిశ్రమలలో అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారు. వీరి విధి నిర్వహణ మొత్తం కంటికి కనిపించని శక్తితో పయనం బ్రతుకంతా దిన దిన గండం. చిన్న ఏమరపాటు సైతం ప్రాణాలను బలితీసుకుం టుంది. జోరువానలోనైన ఎముకలు కోరికే చలిలోనైన మండుటెండల్లోనైన అంతరాయం కలుగకుండా విధినిర్వహణచేయాల్సిందే. ప్రతి వర్షాకాలం తుఫానులతో వరదలు సంభవించినపుడు, వరదలకు ఎదురెళ్లి నడి చెరువులో ఉన్న స్తంభాలను సైతం మరమత్తులు చేసి విద్యుత్ పునరుద్దిం చిన సంఘటనలు చూసే ఉంటాం. విద్యుత్ ఉద్యోగుల పని స్వభావం వేరు కష్టం వేరు. కార్మికులది చెమట కష్టం ఐతే అధికారులది మెదడు కష్టం. అందుకే విద్యుత్ శాఖను అన్ని శాఖలతో పోల్చి చూడోద్దు అంటారు ఉద్యోగులు.

Read Also: Gold rate 05/03/26 : బంగారం ధరల్లో మళ్లీ మార్పు, ఇవాళ నగరాల వారీగా రేట్లు

salary
salary

తెలంగాణ అవతరించిన తొలినాళ్ళలో పీకా హవర్స్ లో 14.3 శాతం సాధారణ సమయంలో 6.2 శాతం విద్యుత్ కొరత
ఉండేది. దిన దిన అభివృద్ధి చెందుతూ ఉపకేంద్రాలను, అధిక ఓల్టేజ్ లైన్లను విస్తరిస్తూ ప్రభుత్వ సహకారంతో సమృద్ధిగల రాష్ట్రంగా మార్చారు. గత పదిసంవత్సరాలలో ఉపకేంద్రాలు లైన్ల సామర్థ్యం రెట్టింపు అయింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో సామర్థ్యం రెట్టింపు అయింది. ఇదే నిష్పత్తిలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందా అంటే లేదనే చెప్పాలి. ప్రతి ఏడాది పదవి విరమణ పొందే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. కొత్త నియామకాలు చేయడం లేదు. విద్యుత్ సరఫరా సంస్థలో 2018 నుండి సంస్థకు మూల స్తంభాలైన ఏఈల నియామకం జరగలేదు. విద్యుత్ సంస్థల సామ ర్థ్యం పెరుగుతుండగా ఉద్యోగుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది. దీనిని బట్టి అర్థం అవుతుంది ఉద్యోగులపై పని భారం ఎలా ఉంది అనేది. ఇంతటి పని భారం మోస్తూ కార్మికులు అధికారుల శ్రమ సృష్టించే సంపదే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ప్రసరణకు కారణం. కానీ రాష్ట్ర అత్యు న్నత స్థాయిలో ఉన్న ముఖ్య కార్యదర్శి వర్యులు ఉద్యోగుల జీతాలపై చేసిన వాక్యలైతే యాదృచ్చికమై ఉండకపోవచ్చని ఎందుకంటే వచ్చే ఏప్రిల్ ఒకటి నుండి
విద్యుత్ ఉద్యోగుల కు కొత్త వేతన సవరణ అమలు చేయాల్సి ఉందని ఈ నేప థ్యంలోనే వేతనాలపై వాక్యలు చేశారని విద్యుత్ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం పదవి విరమణ వయసు ను మూడు సంవత్సరాలు పెంచింది. ఈమూడు సంవత్సరాలలో ఆరు కరవు భత్యాలు మూడు వార్షిక ఇంక్రిమెంట్లు పొందుతారు. అవకాశం ఉంటే పదోన్నతి కూడా వస్తుంది. ఇంకా కలసి వస్తే వేతన సవరణ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు తెరమీదికి వచ్చిన పదవి విరమణకు దగ్గర్లో ఉండే చీఫ్ ఇంజనీర్త స్థాయి అధికారి 7లక్షల జీతంలో పైమార్గాల ద్వారా పెరిగిన జీతానికి కారణం ఉద్యోగులా లేక ప్రభుత్వ విధానాలా అనేది ఆలోచన చేయాలి. అలాగే పదుల సంఖ్య లో ఉండే ఉద్యోగుల జీతాలను నొక్కి చెబుతూ వేలా సంఖ్యలో ఉన్న చిన్నపాటి ఉద్యోగులు ఆర్టీసియన్ల ఆర్థిక స్థితిని మరుస్తున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ సమాజంలో ప్రతి అంశాన్ని అందరు ఒకేలా చూడరు. కొందరు ఒక కోణంలో చూస్తే మరికొందరు మరో కోణంలో చూసేవారున్నారు. ప్రజా పన్నుల నుండి వచ్చిన ఆదాయం రోడ్లు, కాలువలు, విద్య, వైద్యం,
మౌలిక వసతుల నిర్మాణా నికి ఖర్చు పెట్టాలి.

salary
salary

ప్రస్తుత రాష్ట్ర ఆర్థికపరిస్థితి చూస్తే ఒకవంతు జీతాలకు ఇంకొక వంతు అప్పుల Iవడ్డీ చెల్లింపు మరొక వంతు పథకాల నిర్వహణ ఇలా ప్రజలనుండి వివిధ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు అవడంతో పెరుగుతున్న వేతనాలు రాష్ట్రానికి ఆర్థిక భారం అని అలాగే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలురాష్ట్ర ఆయా సంస్థల ఆర్థిక స్థితికి అనుసంధించాలని, రాష్ట్రంలో సగటు మనిషి ఆదాయానికి ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయా నికి భారీ వ్యత్యాసం ఉండకూడదని, వేతన ఆధారిత పని చేయకున్నా, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన, సమయ పాలన పాటించక పనివేళలు వృధా చేసిన, వ్యక్తిగత దురా లోచనలతో అవినీతికి పాల్పడే వారు పరోక్షంగా ప్రజాదోపిడీ చేస్తున్నవారేనని విమర్శించే వారు ఉన్నారు. అలాగే ఉద్యోగుల వేతన రూపంలో వచ్చే ప్రతి రూపాయిలో పెద్దోల్లతో పాటు పేదొల్ల కష్టం కూడా ఉంటుందని అది వృధా కాకూడదని విశ్లేషించే వారున్నారు. వాస్తవానికి ఉద్యోగ బంధనం లేకుండా ఉద్యోగులు తమ సొంత మేలు కోసం పాటుపడితే వారు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగ తంగా ప్రాముఖ్యత సంపాదించుకోగలరు. ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులతో పోటీ పడి వడపోసిన తరువాత పదుల సంఖ్యలో నియామకమవుతున్నారు. తమ వ్యక్తిగత మేలు కోసం కాకుండా ప్రజల మేలు కోసం ప్రజాసేవగా కొందరు భావిస్తే, ప్రభుత్వ ఉద్యోగం సమాజంలో గౌరవంగా భావిం చేవారు మరికొందరు. మెరుగైన జీవన స్థిరత్వం కావాలని ఉద్యోగంలో చేరేవారు కొందరు. వేతనమనే వలయంలో దాని పరిధి దాటకుండా జీవనం వెళ్లదీస్తూ వస్తున్నారు. అందుకే మేలైన అభ్యర్థుల శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆశించే హక్కు ఉంది. వేతన సవరణ ఉద్యోగుల హక్కుగా భావిస్తు న్నారు. ఆర్థిక పరిమితిని బట్టి పెంచాల్సిన బాధ్యత ప్రభు త్వాలది. ప్రజల, రాష్ట్రాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రభుత్వంపైప్రజలతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత ఉంది. ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజల పరస్పర సహకారంతోనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. రాష్ట్రాల ప్రగతే దేశ ప్రగతి.
-బైరబోయిన వెంకటేశ్వర్లు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870