నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియా యాప్‌లలో గంటల తరబడి గడుపుతూ చదువును, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఆందోళనకరమైన పరిస్థితిని గమనించిన కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
Read Also: Israel: నవంబర్లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ సంచలన ప్రకటన
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 4,48,004 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించిన ఆయన.. సామాజిక బాధ్యతలో భాగంగా పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించారు. మొబైల్ వాడకం వల్ల పిల్లల మానసిక స్థితిపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిషేధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. “పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల పిల్లల్లో వచ్చే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నాము” అని సీఎం పేర్కొన్నారు. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు ఉన్న కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలోనే ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ అంశంపై సంకేతాలిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: