हिन्दी | Epaper

Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

Vanipushpa
Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

ఇండియా విదేశాలతో సంబంధాలు పెరుగుతున్నాయి. 2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇండియా పాస్‌పోర్ట్ రాంకింగ్‌(passport ranking) లో గతేడాది 85వ స్థానంలో ఉన్నా, ఇప్పుడు ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారత పాస్‌పోర్ట్ బలోపేతం అవుతున్నట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తున్నప్పటికీ, నో వీసా ఎంట్రీ(Visa-Free Entry) దేశాల సంఖ్యలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగినప్పటికీ, భారతీయ పర్యాటకులు వీసా లేకుండా ప్రయాణించే దేశాల జాబితా 57 నుండి 55కి తగ్గింది. ఇరాన్ (Iran), బొలీవియా(Bolivia) దేశాలు వీసా లేకుండా భారతీయులను వారి దేశాల్లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించాయి.

Read Also: Feb 14: పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్

Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా
Passport: భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

రెగ్యులర్ వీసా దరఖాస్తు చేసుకోవాలి

ఇరాన్: భద్రతా కారణాల దృష్ట్యా, అక్రమ రిక్రూట్‌మెంట్ సమస్యల నేపథ్యంలో ఇరాన్ భారతీయులకు కల్పిస్తున్న ద్వైపాక్షిక వీసా రహిత ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇప్పుడు భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్లాలంటే ముందుగానే రెగ్యులర్ వీసా దరఖాస్తు చేసుకోవాలి. బొలీవియా: ఈ దక్షిణ అమెరికా దేశం గతంలో భారతీయులకు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని ఇచ్చేది. అయితే, జనవరి 2026 నుండి బొలీవియా ఈ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఇ-వీసా (e-Visa) విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనివల్ల ప్రయాణికులు వెళ్లే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 55 దేశాలకు వీసా లేకుండా లేదా ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యంతో వెళ్లవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870