ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఆపరేషన్ సిందూర్, కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన దాయాది దేశానికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అబద్ధపు, స్వప్రయోజనాల కోసమే చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంది. జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేసింది. జెనీవాలో జరిగిన ఐరాస(UNO) సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూకశ్మీర్‌తోపాటు ఆపరేషన్ సిందూర్ అంశాలను లేవనెత్తగా, భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ హరీశ్ పర్వతనేని ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్ ప్రతినిధికి ఒక్కటే అజెండా ఉందని, భారత్‌కు, భారత ప్రజలకు హాని చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సాధారణంగా అంగీకరించలేం అని తేల్చిచెప్పారు. దేశ విధానంగా ఉగ్రవాదాన్ని వాడుకోవడాన్ని సహించటం సాధారణం కాదని చెప్పారు.
Read Also: West Bengal: గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

భద్రతా మండలి కోరిందే తాము చేశాం
ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేయడం మా లక్ష్యం: భారత్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. 2025 ఏప్రిల్ 22న పాకిస్థాన్ మద్దతుతో పనిచేసే ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది నిరపరాధ పౌరులను హత్య చేశారని తెలిపారు. ఆ దాడిని భద్రతా మండలే తీవ్రంగా ఖండించి, దాడికి పాల్పడినవారిని, కుట్రకరదారులను, ఆర్థిక సహాయదారులను శిక్షించాలంటూ స్పష్టం చేసిందన్నారు. భద్రతా మండలి కోరిందే తాము చేశామని, ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరిస్తూ, “ఆ ప్రాంతం గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ భారతదేశంలో విడదీయరాని భాగమే” అని స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు మాట్లాడే హక్కే లేదన్నారు. సింధూ జల ఒప్పందం అంశాన్ని కూడా ప్రస్తావించారు. 65 ఏళ్ల క్రితం భారత్ మంచి నమ్మకంతో ఆ ఒప్పందంలో చేరిందని, కానీ పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడుల ద్వారా దాని ఆత్మను ఉల్లంఘించిందన్నారు. వేలాది మంది భారతీయులు పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: