हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Modi: భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

Vanipushpa
Modi: భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ సందేశం చాలా స్పష్టమైందని, ద్వంద్వ ప్రమాణాలకు తావు ఇచ్చేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై పోరాడుతామని ఆయన తేల్చి చెప్పారు. ఇందుకోసం భారత్, మలేషియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, ఆదివారం ఉదయం పుత్రజయ నగరం వేదికగా ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం(Anwar Ibrahim)తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం అన్వర్ ఇబ్రహీం, నరేంద్ర మోదీ కలిసి సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మోదీ ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.

Read Also: Epstein files : జెఫ్రీ ఎప్‌స్టీన్ చీకటి ప్రయోగాలు, బయటపడ్డ భయంకర నిజాలు!

Modi: భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు
Modi: భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు

భారత్, మలేసియాల సంబంధాలు మరింత బలోపేతం

‘ఇండో-పసిఫిక్ ప్రాంతం అనేది ఇప్పుడు ప్రపంచ వికాసానికి ఒక ఇంజిన్‌లా మారింది. మేం ఆసియాన్ కూటమి దేశాలు సహా యావత్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కోరుకుంటున్నాం. మలేసియా లాంటి మిత్రదేశాల సహకారంతో రాబోయే రోజుల్లో ఆసియాన్ (ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్) కూటమితో భారత్ బంధాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఆసియాన్ – ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)‌పై సమీక్ష త్వరగా పూర్తి కావాలనే వాదనతో మేం ఏకీభవిస్తున్నాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేను, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు అర్థవంతమైన చర్చలు జరిపాం’ అని ప్రధాని మోదీ తెలిపారు. ‘భారత్, మలేసియాల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సముద్ర జల మార్గాల పరంగా చూస్తే భారత్, మలేసియాలు ఇరుగుపొరుగు దేశాలు. భారత సంతతి ప్రజలు భారీసంఖ్యలో నివసిస్తున్న దేశాల జాబితాలో రెండో స్థానంలో మలేసియా ఉంది. ఇరుదేశాల నాగరికతలు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామిక విలువలతో అనుసంధానం అయ్యాయి. గత కొన్నేళ్ల వ్యవధిలో భారత్, మలేసియాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఇందుకోసం నా మిత్రుడు, మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఇంధన, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారం బలోపేతమైందని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్ ఎకానమీ, బయోటెక్, ఐటీ విభాగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. మలేసియా, భారత్ ప్రజల మధ్య సంబంధాలు సైతం మరింత మెరుగయ్యాయని, ఫలితంగా ఇరుదేశాల్లో పర్యాటక రంగానికి ఊతం లభించిందని పేర్కొన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మలేసియా, భారత్‌‌ భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంత వేగంతో బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

కాలుష్య కాసారంలో నగరాలు!

కాలుష్య కాసారంలో నగరాలు!

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

పామాయిల్ తోటలో భారీగా గంజాయి పట్టివేత

పామాయిల్ తోటలో భారీగా గంజాయి పట్టివేత

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

📢 For Advertisement Booking: 98481 12870