భారత్‌తో ఒక సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. ఈయూ బృందం భారత్ పర్యటన సమయంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈయూ విదేశాంగ, భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్(Kaja Kallas) తెలిపారు. ఈమేరకు యూరోపియన్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఆమె మాట్లాడారు. భారత్- ఈయూ మధ్య 16వ శిఖరాగ్ర సమావేశం దిల్లీలో జరగనుంది. రిపబ్లిక్ డేకు ప్రత్యేక ఆహ్వానితులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్ వస్తున్నారు. ఈ పర్యటనలోనే భారత్–ఈయూ వ్యూహాత్మక అజెండాను ఆమోదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: America: చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ

ఇండియాతో కొత్త భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందం
‘భారత్‌తో పటిష్టమైన నూతన వాణిజ్య అజెండాను అమలు చేయడానికి యూరప్ సిద్ధంగా ఉంది. ఈరోజు ఇండియాతో కొత్త భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈయూ అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సైబర్ రక్షణ వంటి రంగాల్లో ఇరు వర్గాల సహకారం మరింత విస్తరిస్తుంది. వచ్చే వారం దిల్లీలో జరిగే ఈయూ- ఇండియా సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఎదురు చూస్తున్నా’ అని కాజా కల్లాస్ పేర్కొన్నారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్ కూడా స్పందించారు. భారత్-ఈయూ మధ్య కుదిరే వాణిజ్య డీల్ చివరి దశలో ఉందని, దీన్ని కొందరు అన్ని ఒప్పందాలకు తల్లిగా అభివర్ణిస్తున్నారని ఇటీవల ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: