ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం బ్రిటన్‌లోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయనే అభియోగంతో అమెరికాలోని మాజీ బ్రిటన్ రాయబారి 72 ఏళ్ల పీటర్ మండేల్సన్(Peter Mandelson)ను సోమవారం (ఫిబ్రవరి 23న) మధ్యాహ్నం బ్రిటన్ పోలీసులు అరెస్టు చేయగా, 12 గంటల్లోనే ఆయన రిలీజయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆయనను పోలీసులు రిలీజ్ చేశారు. అయితే పీటర్ మండేల్సన్ అరెస్టు, విచారణ, బెయిల్‌పై స్పష్టమైన సమాచారాన్ని బ్రిటన్ పోలీసులు బయటపెట్టలేదు. ఓ 72 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నించామని, ఆయన బెయిల్‌పై రిలీజ్ అయ్యారని మీడియాకు పోలీసుశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఆ వ్యక్తి పేరు ఏమిటో వెల్లడించలేదు.
Read Also: Indian Railways: ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్

కారులో పోలీసు స్టేషనుకు తరలిస్తున్న వీడియో
సోమవారం మధ్యాహ్నం సాధారణ దుస్తుల్లో లండన్‌లోని పీటర్ మండేల్సన్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన్ను కారులో పోలీసు స్టేషనుకు తరలిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీంతో అరెస్టు వార్తలకు ధ్రువీకరణ లభించింది. అమెరికాలో బ్రిటన్ రాయబారి హోదాలో ఉన్నప్పుడు ఎప్‌స్టీన్‌ను ఎందుకు కలిశారు? బ్రిటన్ ప్రభుత్వానికి ముడిపడిన ఏదైనా సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు ఇచ్చారా? ఎఫ్‌స్టీన్‌తో ఏవిధమైన సంబంధాలు ఉన్నాయి? అనే అంశాలపై మండేల్సన్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అందించారనే అభియోగాలను పీటర్ మండేల్సన్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ ఎదుర్కొంటున్నారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆధారాలు వెలుగుచూడటంతో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూను పోలీసులు ఫిబ్రవరి 19న అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: