हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Stalin: రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​

Vanipushpa
Stalin: రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​

భారత రాజ్యాంగాన్ని సవరించాలంటూ డిమాండ్ చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Stalin). రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కల్పించేలా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాజ్యాంగ సవరణను అవసరమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిర్మాణాత్మక పునర్​నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ నివేదిక మొదటి భాగాన్ని తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం రావాల్సిన నిధులను దక్కించుకునేందుకు కేంద్రంతో పోరాటం చేయాల్సిన పరిస్థితిలోకి తమిళనాడును నెట్టివేశారని విమర్శించారు. భారత్​ లాంటి వైవిధ్యం ఉన్న దేశానికి సమాఖ్య వ్యవస్థ పునాది లాంటిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలపై ఎలాంటి గౌరవం లేకుండా కేంద్రమే అన్ని అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రాలను గౌరవించకుండా కేంద్రమే అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకుందని విమర్శించారు.

Read Also: Bank jobs 2026: SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

Stalin: రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​
Stalin: రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​

నిధులు సహా కొన్ని హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం: స్టాలిన్​

“ఒక రాష్ట్రంగా మా ప్రజల కలలను నిజం చేసేందుకు మాకు అధికారాలు కూడా లేవు. సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఆర్థికం, మౌలిక సదుపాయల కల్పనలో చాలా అభివృద్ధి సాధించాం. కానీ నిధులు సహా కొన్ని హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను దక్కించుకునేందుకు ప్రతీసారి పోరాడాల్సిన పరిస్థితిల్లో మనం ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు వారు ఇస్తుంటే మనం తీసుకునే స్థితిలో ఉందాం? మేము ప్రతీ సారి తలవంచి అడుక్కునే వ్యక్తులం కాదు. మా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలి. కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ ఉంటేనే ప్రజలకు సుపరిపాలనను అందించగలం. భారత్​ లాంటి వైవిధ్యం ఉన్న దేశానికి సమాఖ్య వ్యవస్థ పునాది లాంటింది. రాష్ట్రం- కేంద్రం మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ అందించిన నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాం. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని అందించేందుకు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని సవరించాలి. ఇప్పటికీ మనకు వచ్చే రాజ్యాంగ హక్కులు, నిధులు, అధికారాల కోసం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అందుకే భారతదేశ సమాఖ్య వ్యసస్థకు నిర్మాణాత్మక పునర్​ నిర్మాణం అవసరం అని స్టాలిన్​ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870