हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Nara Lokesh: ‘ఆంధ్రా మోడల్’ ఆదర్శం

Rajitha
Nara Lokesh: ‘ఆంధ్రా మోడల్’ ఆదర్శం

విద్యారంగ సంస్కరణల్లో ఎపి ముందుకు 100% అక్షరాస్యత కోసం ప్రత్యేక ప్రాజెక్టు: మంత్రి లోకేష్

విజయవాడ: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖ రూ.2,566 కోట్ల బడ్జెట్ డిమాండ్లపై మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీలో 100శాతం అక్షరాస్యత సాధించేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు.

Read also: Bullet train : విజయవాడ-వైజాగ్ మధ్య 320 కిమీ వేగంతో బుల్లెట్ రైలు ప్రతిపాదన

'Andhra Model' is ideal

‘Andhra Model’ is ideal

క్లిక్కర్ టెక్నాలజీ మరియు డిజిటల్ సంస్కరణలు

విద్యార్థులను యాక్టివ్ గా మార్చేందుకు క్లిక్కర్ టెక్నాలజీ తెచ్చామని 300కు పైగా పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ కిట్లు, చిక్కీలు, గుడ్ల సరఫరాలో అవినీతి నివారించి రూ.1000 కోట్లు ఆదా చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ చెప్పారు. జీతభత్యాలు, సౌకర్యాలు ఏమీ లేకుండా నైతిక విలువలు పెంచటం బాధ్యతగా తీసుకున్న చాగంటి కోటేశ్వరరావుని సభాముఖంగా అభినందించారు. మా సొంత పిల్లలకు ఏం చేస్తామో అందరు పిల్లలకు అలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

2019– 24 మధ్య విద్యాశాఖలో తీవ్ర విధ్వంసం జరిగిందని, 10లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని మండిపడ్డారు. అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థుల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, అక్షరాస్యత విషయంలో ఏపీని అట్టడుగు స్థానానికి చేర్చారని వ్యాఖ్యానించారు. ఐబీ, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ పేరుతో ప్రకటనలు, ప్రచారం తప్ప ఒక్క పనీ సరిగా చేయలేదని మంత్రి లోకేశ్ అన్నారు. నాడు- నేడు పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప పనులు జరగలేదని విమర్శించారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

వర్సిటీల ప్రక్షాళన మరియు పోస్టుల భర్తీ

వైఎస్సార్సీపీ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చటం, తమ బంధువుల్ని వీసీలుగా రిజిస్ట్రార్లుగా నియమించటం ద్వారా ఉన్నత విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తన కుమారుడు దేవాన్ను బ్రాహ్మణి ఫోన్కు దూరంగా ఉంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసిందని అన్నారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు కోసం శోభా రియాల్టీ వారు రూ.100 కోట్లు సీఎస్సార్ నిధులు సెంట్రల్ లైబ్రరికి ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, సుందరపు విజయ్ కుమార్ విద్యారంగంపై మాట్లాడారు.

3 నెలల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీ

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి 3నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని మండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారని వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించక పోవడంతో 2023 నోటిఫికేషన్ను కోర్టు తప్పు బట్టినందున సదరు ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పటికే మేం ఏఏజీతో మూడు సార్లు సమావేశమై పూర్తిస్థాయిలో చర్చించామని నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేం నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870