Iran: ఇరాన్ సుప్రీం లీడర్, కోట్లాది ప్రజల అభిమాని అయిన అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడైనా అలీ ఖమేనీ గత శనివారం ఇజ్రాయెల్-అమెరికా చేసిన సంయుక్త మిసైల్స్ దాడిలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మరణవార్త యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఖమేనీతో పాటు ఇరాన్ లోని రక్షణశాఖలోని కీలకనేతలు, ఇతర నేతలు కూడా మరణించారు. దీంతో ప్రతికారచర్యలకు ఇరాన్ దిగింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దేశాలను టార్గెట్ చేస్తూ, ప్రతిదాడులకు పూనుకున్నది. కాగా ఇరాన్ దేశంలో అలీ ఖమేనీ మృతితో ఒకవర్గం ప్రజలు ఆనందాలతో సంబరాలు చేసుకుంటుండగా, మరోవర్గం తమ ప్రియతమ నాయకుడు లేడని, తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ మృతికి గౌరవంగా 40రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. ఏడుదినాలు ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటించింది.
Read Also: Operation Epic Fury: ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి అసలు కారణం ఇదే!

ఖమేనీ సొంతూరులో అంత్యక్రియలు
కాగా శుక్రవారం అయతుల్లా ఖమేనీ(Iran) అంత్యక్రియలకు ఏర్పాటు ముమ్మరం చేస్తున్నారు. ఖమేనీ సొంతూరు మషాద్ లో ఖననం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాక టెహ్రాన్ లో నేటి నుంచి మూడురోజుల పాటు అంతిమ దర్శనాలకు అనుమతి ఇచ్చారు. తమ ప్రియతమ నాయకుడికి కోట్లాదిమంది ప్రజలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. మసీద్ లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజబా ఖమేనీ (56) నియమితులయ్యారు. ముజబా ఖమేనీ 1969లో మషాద్ నగరంలో జన్మించారు. తండ్రి పాలనలో పరిపాలన, అత్యున్నత నిర్ణయాల్లో ముజబా కీలక పాత్ర పోషించినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: