हिन्दी | Epaper

North Korea: మరింత దూకుడుగా అణ్వాయుధాల తయారీ

Vanipushpa
North Korea: మరింత దూకుడుగా అణ్వాయుధాల తయారీ

అణ్వాయుధాల తయారీపై ఉత్తర కొరియా (North Korea) మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో జరగబోయే వర్కర్స్‌ పార్టీ ప్లీనరీలో అణు కార్యక్రమాలను ఉద్ధృతం చేసే ప్రణాళికను ప్యాంగ్‌యాంగ్‌ అధినేత కిమ్‌ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. బహుళ బాలిస్టిక్‌ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్‌ ప్రకటన చేసిన మరుసటిరోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం కిమ్‌ సమక్షంలో బహుళ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.

Read Also: FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

North Korea: మరింత దూకుడుగా అణ్వాయుధాల తయారీ
North Korea: మరింత దూకుడుగా అణ్వాయుధాల తయారీ

దేశ అణు యుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం

“దేశ అణు యుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి తదుపరి దశ ప్రణాళికలను వెల్లడిస్తాం. ప్రస్తుతం చేపట్టిన ఈ పరీక్ష ఫలితం మనతో సైనిక ఘర్షణను రేకెత్తించడానికి ప్రయత్నించే శక్తులకు బాధాకరమైన మానసిక వేదన, తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇది మా వ్యూహాత్మక నిరోధక ప్రభావాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైనది.” అని కిమ్​ అన్నారు. కిమ్​తో పాటు ఆయన చిన్న కుమార్తె, ఉత్తర కొరియా సీనియర్ అధికారులు కలిసి ఈ ప్రయోగాన్ని వీక్షించారని KCNA తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించగా, ఇందులో రెండు క్షిపణులు దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల ల్యాండ్ అయ్యాయి. భారీ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థల మొబిలిటీ, దాడుల కచ్చితత్వం మెరుగుపడినట్లు పేర్కొంది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్‌ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్‌ పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. తదుపరి దశ అణు కార్యక్రమాలను వర్కర్స్‌ పార్టీ సమావేశాల్లో కిమ్‌ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయటం ఐదేళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870