हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

Sai Kiran
Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

Gold rate record : దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడి అందుబాటును దాటి వేగంగా పెరుగుతున్నాయి. రోజుకో కొత్త రికార్డుతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుండగా, వెండి కూడా అదే బాటలో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.2 లక్షల మార్క్‌కు చేరువవుతుండగా, వెండి ధర ఏకంగా రూ.4.2 లక్షలను దాటడం గమనార్హం.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను మరింత పైకి నెట్టుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ, బంగారంపై డిమాండ్ (Gold rate record) మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఇటీవలి రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.12 వేల వరకు పెరగగా, కిలో వెండి ధర దాదాపు రూ.30 వేల వరకు పెరిగింది.

Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

Gold rate record
Gold rate record

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886కు చేరగా, 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర రూ.1,63,960 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ దాదాపు ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం.

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా ఆల్‌టైమ్ హైని తాకాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.4,25,100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలోనూ దాదాపు ఇదే ధర ఉండగా, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.4.10 లక్షల స్థాయిలో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870