Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త ఇది. వరుస సెషన్లలో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గగా, అంతర్జాతీయ మార్కెట్లో ఒక దశలో భారీ పతనం అనంతరం మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయో చూద్దాం.
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా రెండో రోజూ ధరలు పడిపోగా, ఇప్పటివరకు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా తగ్గాయి. బంగారం ధర మాత్రం ఒక దశలో నిన్నటి కనిష్టాలకు చేరి, ఆ తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగింది.
దేశీయంగా Hyderabad నగరంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి తులం రూ.1,25,650 వద్ద స్థిరపడింది. నిన్న రూ.500 తగ్గిన ధర, దానికి (Gold Rate) ముందు రోజుల్లో వరుసగా రూ.550, రూ.2,200 వరకు పెరగడం గమనార్హం. అదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి ప్రస్తుతం రూ.1,38,000 వద్ద ట్రేడవుతోంది. అంతకు ముందు రోజు ఇది రూ.550 తగ్గగా, ఆకు ముందు రెండు రోజుల్లో సుమారు రూ.3,000 పెరిగింది.
Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు
బంగారంతో పోలిస్తే గత కొంతకాలంగా వెండి ధరలు తీవ్రంగా పెరిగిన విషయం తెలిసిందే. 2025లో బంగారం ధర దాదాపు 70 శాతం పెరిగితే, వెండి ధర రికార్డ్ స్థాయిలో 170 శాతం వరకు పెరిగింది. కొత్త సంవత్సరంలోనూ వెండికి బంగారాన్ని మించే వేగం కనిపించింది. వారం వ్యవధిలోనే కిలోకు రూ.20,000 వరకు పెరిగిన వెండి ధర, ఇప్పుడు ఒక్కసారిగా రూ.5,000 తగ్గి కేజీ రూ.2.72 లక్షలకు చేరింది. దీంతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర ఒక దశలో భారీగా పడిపోయి మళ్లీ పుంజుకుంది. నిన్న ఔన్సుకు స్పాట్ గోల్డ్ ధర 4,450 డాలర్ల స్థాయి నుంచి 4,400 డాలర్లకు పడిపోయి, రాత్రికి రాత్రే 4,460 డాలర్ల వరకు ఎగబాకింది. సిల్వర్ ధర మాత్రం 78 డాలర్ల స్థాయి నుంచి 75 డాలర్లకు తగ్గింది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాన్నిబట్టి మారుతుంటాయి. స్థానిక పన్నులు, ఇతర అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. జువెల్లరీ కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: