हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Tirumala: ఘాట్లో భక్తులను భయపెడుతున్న ఏనుగులు!

Ramya
Tirumala: ఘాట్లో భక్తులను భయపెడుతున్న ఏనుగులు!

తరచూ మొదటి ఘాట్ రోడ్ల పై సంచారం – ద్విచక్రవాహనాలపై వెళ్లవద్దని హెచ్చరిక

Tirumala: శేషాచలం రిజర్వు అటవీప్రాంతంలో మొన్నటి వరకు చిరుతపులుల సంచారంతో భయపడిన భక్తులు ఇప్పుడు తాజాగా తిరుమల నుండి తిరుపతికెళ్ళే మొదటి ఘాట్లో ఏనుగుల భయంతో వణికిపోతున్నారు. ఏనుగులు గుంపులుగా ఆటవీప్రాంతంలో రోడ్డును దాటుతుండటంతో ఎప్పుడు ఎలా వచ్చి దాడిచేస్తాయనే భయపడుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో తిరుమల మొదటిఘాట్లో ఏనుగుల ఆర్చి సమీపంలో గుంపుగా ఏనుగులు (Elephants in a group) రోడ్డుదాటుతుండటంతో అటుగా వచ్చిన ద్విచక్రవాహనదారులు, వాహనదారులు భయపడిపోయారు. గుంపునుండి ఓ ఏనుగు ఘాట్ రోడ్డుమీదికి రావడంతో మరింత వణికిపోయారు. సమాచారాన్ని టిటిడి విజిలెన్స్ కు, అటవీశాఖకు తెలియజేయడంతో ఏడవమైలు, మోకాళ్ళపర్వతం వద్దఉన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏనుగులను అడవిలోకి తరిమేందుకు వాహనాల హారన్లు, గట్టిగా కేకలు, వాహనాల హెడ్లైట్ల వెలుగును ప్రసరింపజేయడంతో అవి వెనక్కివెళ్ళాయి. అయితే తిరుమల ఘాట్లో ఇప్పటి వరకు ఏనుగులు యాత్రికులపై దాడిచేసిన సందర్భాలు లేవనే తెలుస్తుంది.

Tirumala: ఘాట్లో భక్తులను భయపెడుతున్న ఏనుగులు!
Tirumala: ఘాట్లో భక్తులను భయపెడుతున్న ఏనుగులు!

ఘాట్ రోడ్లపై ఏనుగుల సంచారం: భక్తుల్లో ఆందోళన

తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్ల లో ఏనుగులు సంచారం మొదలవడంతో టిటిడి అధికారులు కూడా వాహనదారులకు తగిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఎవరూ కూడా వాహనాల్లో ఒకరుగా వెళ్ళొద్దని, గుంపులుగా వెళ్ళాలని హెచ్చరిస్తున్నారు. మొన్నటివరకు ఘాట్లో, కాలినడక మార్గాల్లో చిరుతల సంచారంతో బెంబేలెత్తిపోయిన భక్తులకు ఇప్పుడు ఏనుగులు రాకతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అడవిలో ఆహారం దొరకని (There is no food in the forest) సమయంలో ఏనుగులు దారిమళ్ళి ఇలా ఘాట్ రోడ్ల పైకి వచ్చేస్తున్నాయనేది టిటిడి అటవీశాఖ వర్గాల సమాచారం. ఈ సమయంలో ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి వెళ్ళిపోతాయని, ఏనుగులకు మనుషులు కూడా కనిపించరాదని చెబుతున్నారు. ఏనుగులు నాలుగైదుపైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం

శేషాచలంలో మామండూరు నుండి పాపవినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, భాకరాపేట, చంద్రగిరి, రంగంపేట, బీమవరం, యర్రావారిపాళెం ప్రాంతాల్లోని అడవుల్లో ఏనుగులు సంచారం ఉంది. ఈ ఏనుగులు ఆహారం వెదుక్కుంటూ దారితప్పి ఇలా పంటపొలాలపై, నీటికోసం సమీపంలోని మడుగులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. టిటిడి అటవీశాఖ, విజిలెన్స్ విభాగాలు ఘాట్రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తూ భక్తులకు భద్రత కల్పించేలా చూస్తున్నారు. ఇదేగాక శేషాచలం అటవీప్రాంతంలో తిరుమలకొండకు ఉన్న కాలినడకమార్గాల్లో క్రూరమృగాల బారి నుండి భక్తులను కాపాడటానికి టిటిడి చర్యలు చేపట్టింది. ఘాట్లో ఏనుగులు, చిరుతలు సంచారం ఉన్నచోట్ల “ఫోకస్ లైట్లు “ఏర్పాటు చేస్తే వన్యప్రాణుల సంచారం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. భక్తుల భద్రతకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. తరచూ ఏటా మే, జూన్, జూలై నెలల్లో ఏనుగులు తిరుమలలోని పానవినాశనం, శ్రీవారి పాదాలు ప్రాంతాల్లో ఆహారం కోసం సంచారం ఉంటుంది. దారితప్పి ఇలా ఘాట్లో వచ్చేస్తుండటం జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: TDP: టిడిపిలో భగ్గుమన్న వర్గ విభేదాలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870