हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Tiktok : టిక్ టాక్‌కు డొనాల్డ్ ట్రంప్ కొత్త లైఫ్

Vanipushpa
Tiktok : టిక్ టాక్‌కు డొనాల్డ్ ట్రంప్ కొత్త లైఫ్

చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. ఈ క్రమంలో మరో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.
టిక్ టాక్ ఈజ్ బ్యాక్
టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నిషేధాన్ని అక్కడి న్యాయస్థానం సమర్థించింది కూడా. దీన్ని పునరుద్ధరిస్తానంటూ అప్పట్లో హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అంటూ అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలోనే స్పష్టం చేశారు.

టిక్ టాక్‌కు డొనాల్డ్ ట్రంప్ కొత్త లైఫ్

90 రోజుల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు
నిషేధాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను విక్రయించడానికి బైట్‌డాన్స్‌కు మరింత గడువు ఇస్తానని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు సైతం తీసుకున్నారాయన. ఈ నిషేధాన్ని 90 రోజుల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు కూడా ఏ అమెరికన్ కంపెనీ కూడా బైట్‌డ్యాన్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు రాలేదు. దీనితో ఈ గడువును తాజాగా పొడిగించారు ట్రంప్. ఈ డెడ్‌లైన్‌ను మరో 75 రోజుల పాటు పొడిగించినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. టిక్ టాక్‌ను కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు.

అమెరికాలో టిక్ టాక్ మనుగడ సాగించాలంటే..
అమెరికాలో టిక్ టాక్ మనుగడ సాగించాలంటే, ఆ దేశ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. యూఎస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా 50 శాతం వాటాను టిక్ టాక్ మాతృసంస్థలో కలిగి ఉంటుందని నిబంధనను పెట్టారు. గడువు ముగియబోతోన్న నేపథ్యంలో- దీన్ని మరో 75 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలన్నీ కూడా చాలావరకు ఒరాకిల్ సర్వర్‌లలో ఉన్నాయనేది తెలిసిందే. ఈ కంపెనీ ఛైర్మన్ లారీ ఎల్లిసన్.. డొనాల్డ్ ట్రంప్‌కు ఆప్తుడని అక్కడి మీడియా వెల్లడించింది. గడువు పొడిగించడానికి ఇదీ ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది.

ALSO READ: Canada: కెనడాలో భారతీయుడి దారుణహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870