ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

Donald Trump: ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ కోడలు వెనెసా ట్రంప్ ‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది..’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు వెనెసాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వెనెసా సైతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైగర్‌ వుడ్స్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించారు.

ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

2018లో విడాకులు తీసుకున్న ట్రంప్‌ జూనియర్‌
కాగా, ట్రంప్‌ కుమారుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో 2005 నవంబర్‌ 12న వెనెసా వివాహం జరిగింది. ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఎస్టేట్‌ మార్‌ ఎ లాగో క్లబ్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ట్రంప్‌ జూనియర్‌కు 2020లో ఫాక్స్‌న్యూస్‌ మాజీ హోస్ట్‌ కింబర్లీతో నిశ్చితార్థం జరిగింది.


టైగర్‌ వుడ్స్‌ కు పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు
ఇక టైగర్‌ వుడ్స్‌ గతంలో స్వీడిష్‌ మోడల్‌ ఎలిన్‌ నార్డెగ్రెన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, 15 సార్లు మేజర్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ గోల్ఫర్ పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2010లో ఎలిన్‌ విడాకులు తీసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలిన్‌తో విడాకుల తర్వాత అమెరికన్ స్కీయింగ్ లెజెండ్ లిండ్సే వాన్, ఎరికా హెర్మన్‌ సహా పలు హై ప్రొఫైల్‌ ఉన్న వారితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ మాజీ కోడలితో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించాడు.

Related Posts
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటన : 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు మరణం
pak train hijack

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు తెరపడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన రైలును పాకిస్థాన్ భద్రతా బలగాలు విజయవంతంగా తిరిగి Read more

IPL : క్యాచ్ లతో ఐపీల్ చరిత్రలో ప్రత్యేకస్థానం పొందిన క్రికెటర్లు
IPL : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008 నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ప్రతిభకు వేదికగా మారింది. బ్యాటర్లు మెరుపులు మెరిపిస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తుంటే, బౌలర్లు Read more

USA: అణ్వాయుధాలను తమ దేశంలో మోహరించాలన్న పోలాండ్ విజ్ఞప్తికి ట్రంప్ నో
మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

రష్యా దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తమ దేశంలో అమెరికా అణ్వాయుధాలను మోహరించాలి అనే పోలాండ్ అభ్యర్థనను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ విషయాన్ని Read more

బోస్నియాలో మంచు తుఫాను : విద్యుత్తు లేకుండా 200,000 గృహాలు
bosnia

బోస్నియా మరియు హెర్జెగోవినా దేశంలో మంచు తుఫాను కారణంగా 200,000 కంటే ఎక్కువ గృహాలు బుధవారం రెండవ రోజు కూడా విద్యుత్తు లేకుండా ఉన్నాయి. అధికారులు తెలిపినట్లు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *