CM Breakfast scheme

తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఇదే..!

రాష్ట్రంలో 10వ తరగతికి సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మెనూ రూపొందించారు రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సర్కారు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది.

Healthy Indian Snack Recipes for Kids

తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు (మిల్లెట్ బిస్కెట్లు), పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి  వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. అందుకోసం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు బదిలీ చేయనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనుండగా… ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ లో స్నాక్స్ అందించనున్నారు.

Related Posts
సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్..వెంటిలేటర్‌పై చికిత్స
Singer Kalpana commits suicide attempt...treated on ventilator

హైదరాబాద్‌: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? Read more

సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB ‘షీల్డ్’
సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB 'షీల్డ్'

TGCSB 'షీల్డ్' సురక్షితమైన మరియు స్థితిస్థాపకమైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైబర్ క్రైమ్ మరియు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో Read more

Telangana: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
goverment of telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మరియు వైస్‌ చైర్మన్‌ ల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రకారం, నల్సార్‌ Read more

ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.
Thummala Nageswara Rao

తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి Read more