జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై బాలీవుడ్ నటుడు, మానవతావాది సోనూ సూద్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “ఇది కేవలం పహల్గామ్‌పై జరిగిన దాడి కాదు, ఇది ప్రతి ఒక్క భారతీయుడి మనసుపై జరిగిన దాడి” అని వ్యాఖ్యానించారు.
ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి
సోనూ సూద్ పేర్కొంటూ, ఈ దాడిలో తన తండ్రిని కోల్పోయిన ప్రతి బిడ్డ బాధను, భర్తను కోల్పోయిన ప్రతి భార్య వేదనను మాత్రమే కాదు, దేశంలోని ప్రతి పౌరుడు ఈ విషాదాన్ని హృదయపూర్వకంగా అనుభవిస్తున్నారని అన్నారు. మన దేశ ప్రజలపై జరిగిన ఈ కిరాతక చర్యపై ఎవరూ మూగబోయే పరిస్థితిలో లేరని, ప్రతి భారతీయుడి మనస్సులో ఇది చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పారు.
కుట్రలకూ తగిన సమాధానం చెప్పే శక్తి భారత్ కు ఉంది
ఇలాంటి దాడులకు తగిన బదులు ఇవ్వడం దేశ పరిరక్షణలో భాగమని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. శాంతి ప్రేమించే దేశంగా భారతదేశం ఎంత స్థితిపరంగా ఉన్నా, దేశ భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి కుట్రలకూ తగిన సమాధానం చెప్పే శక్తి భారత్‌కి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం రూపంలో భారత ప్రజలపై జరిగే అణచివేతలపై దేశం ఏకమై నిలబడాలని ఆయన కోరారు.
Read Also : Pakistan hackers: పాక్ నకిలీ పీడీఎఫ్‌లతో భారతీయులే టార్గెట్!