ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపారు. దీంతో ఈ మ్యాచ్ గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన అద్భుత ప్రదర్శనతో అందరి మనస్సులు గెలిచాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ ఆడుతూ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. సెంచరీ చేసిన అనంతరం విరాట్ కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు.
దేవుడు నాతో ఉన్నాడు
“ఈ రోజు రాత్రి దేవుడు నాతో ఉన్నాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను ఎప్పుడయితే లో గా ఫీలవుతానో అప్పుడు నాకు నేను ఇలా చెప్పుకుంటా.. ప్రతి బంతికి కూడా నువ్వు వంద శాతం న్యాయం చేయాలి. అలానే చేశా” అంటూ విరాట్ కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్‌తో కలిసి రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా మెయింటేన్ చేశాడు. గిల్ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మిడిల్ ఓవర్లలో రాణించాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను అడ్డుకుని నిలబడ్డాడు.

‘నేను చెప్పానుగా.. ‘
ముప్పై ఓవర్లు దాటిన తర్వాత విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ కాస్తంత దూకుడు పెంచుతూ విజయానికి దగ్గరగా వెళ్లారు. అదే సమయంలో విరాట్ కోహ్లి కూడా సెంచరీకి దగ్గరగా వెళ్లి బౌండరీతో శతకం పూర్తి చేయడమే కాకుండా మ్యాచ్‌ని కూడా గెలిపించాడు. భారత్ గెలవగానే విరాట్ కోహ్లి కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూస్తూ ‘నేను చెప్పానుగా.. నేను ఉంటాను’ అని చేతులతో సైగలు చేశాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లోకి వచ్చి విరాట్ కోహ్లిని ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. సెంచరీ చేయడంతో అభినందించాడు. ఆ తర్వాత ఏదో ఫన్నీగా మాట్లాడుకున్నారు. బహుశా హార్దిక్ పాండ్యా హిట్టింగ్ గురించే అనుకుంటా. అంతకుముందు కోహ్లి క్రీజులో ఉన్నప్పుడు గాల్లో సిక్సర్ బాదేసి సెంచరీ చెయ్ అంటూ రోహిత్ శర్మ చెప్పడం ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది.
టాప్ పొజిషన్‌లో..
దాయాదుల సమరం అంటే ఇండియా, పాకిస్థాన్ దేశాల క్రికెట్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ టీవీలకు అతుక్కుపోతారు. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ అమితాసక్తి కనబర్చారు. 5 మిలియన్లకుపైగా సెర్చ్‌తో గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్లో నిలిచింది. మన దేశంలో జమ్మూ కశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, ఒడిశా, డామన్ డయ్యన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఈ మ్యాచ్ గురించి గూగుల్‌లో తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబర్చారు.
పుతిన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలకు సిద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం ముగించే ఉద్దేశ్యంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ చర్చలు ఉక్రెయిన్ Read more
Sunita Williams : సునీత కు సాటి మరెవరూ లేరని చిరంజీవి ప్రశంస మెగాస్టార్ చిరంజీవి, భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ Read more
Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బిహార్ Read more
బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థులు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనున్నారు. నిధుల కొరత కారణంగా UN ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) శరణార్థులకు అందించే రేషన్‌ను సగానికి తగ్గిస్తున్నట్లు Read more