train

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటి వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో 26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) ను ఈ నెల 4 నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో ఆపబోతున్నారు. అలాగే నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17232) ను కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో నిన్నటి నుంచి ఆపుతున్నారు. హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5నుంచి ఆపనున్నారు. అలాగే ఎర్నాకుళం-పాట్నా ఎక్స్ ప్రెస్ (22669)ను ఈ నెల 5 నుంచి ఖమ్మంలో ఆపబోతున్నారు. బీదర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (17009)ని మర్పల్లిలో ఇవాళ్టి నుంచి హాల్ట్ ఇస్తున్నారు.

Advertisements

అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (23655)ను నిన్నటి నుంచి పెద్దపల్లిలో ఆపుతున్నారు. అలాగే సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (10705) రైళ్లను ఇవాళ్టి నుంచి నెక్కొండలో ఆపుతున్నారు. చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) రైలుకు ఈ నెల 8 నుంచి వరంగల్ లో హాల్ట్ ఇచ్చారు. అలాగే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలుకు నిన్నటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో స్టాపులు ఇచ్చారు. అటు తిరుపతి-లింగంపల్లి (12733) రైలును నిన్నటి నుంచి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో ఆపుతున్నారు. అలాగే నరసాపురం-లింగంపల్లి (17255) రైలును నిన్నటి నుంచి నల్గొండలో ఆపుతున్నారు. లింగంపల్లి-నరసాపూర్ (17256) రైలును నిన్నటి నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు. పూరీ-తిరుపతి (17479), బిలాస్ పూర్ -తిరుపతి(17481), తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైళ్లను నిన్నటి నుంచి చిన్న గంజాంలో ఆపుతున్నారు.

Related Posts
కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది – కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, "కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు" Read more

AI విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టాస్క్‌ఫోర్స్‌: మహారాష్ట్ర
ashish shelar

దేశంలోని మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ప్రణాళిక అమలు కోసం మహారాష్ట్ర ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం AI సంబంధిత రంగాలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా హోమ్ గార్డు అరెస్ట్
Female home guard arrested

వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ Read more

అదానీ ఇంట్లో మొదలైన పెళ్ళిసందడి.
Jeet Adani and Diva Shah

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, గౌతమ్ అదానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అదానీ చిన్నకుమారుడు జీత్ అదానీ పెళ్లిపీటలెక్కనున్నారు. జీత్ Read more

×