పాక్ క్రికెట్ పతనానికి కారణాలు ఇవే: ఇంజ‌మాముల్ హ‌క్‌

Inzamam-ul-Haq: పాక్ క్రికెట్ పతనానికి కారణాలు ఇవే: ఇంజ‌మాముల్ హ‌క్‌

ఇటీవల కాలంలో పాక్ క్రికెట్ ఒడుదుడుగులకు గురి అవుతున్నది. తాజాగా పాక్ మాజీ ఆటగాడు ఇంజ‌మాముల్ హ‌క్‌ మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత‌కాలంగా పాకిస్థాన్ క్రికెట్ ఘోరంగా ప‌త‌నం అవుతున్న విష‌యం తెలిసిందే. ప్రధానంగా ఐసీసీ ఈవెంట్ల‌లో ఆ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌నను కొన‌సాగిస్తోంది. ఇటీవ‌ల తాను ఆతిథ్య‌మిచ్చిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ పాక్ ఒక్క విజ‌యం కూడా న‌మోదు చేయ‌కుండానే లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Advertisements
పాక్ క్రికెట్ పతనానికి కారణాలు ఇవే: ఇంజ‌మాముల్ హ‌క్‌


మాజీ ఆట‌గాళ్ల‌ విమ‌ర్శ‌లు
ఈ నేప‌థ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆట‌గాళ్ల‌పై మాజీలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇది ఇలాగే కొన‌సాగితే మునుముందు పాక్ జ‌ట్టుకు తీవ్ర‌ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక పాక్ క్రికెట్ ఇంతగా ప‌త‌నం కావ‌డంప‌ట్ల ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజ‌మాముల్ హ‌క్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. చాలా విష‌యాల్లో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. త‌ర‌చుగా జ‌ట్టు, సిబ్బందిలో మార్పులు చేయ‌డం వల్ల సమస్య పరిష్కారం కాద‌ని, కూర్చుని తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో ఆలోచించాలని తెలిపాడు.
రెండేళ్లుగా ప‌త‌న‌మ‌మవుతున్న పాక్ క్రికెట్
పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త‌న త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల‌న్నారు. గ‌త రెండేళ్లుగా చేస్తున్న త‌ప్పుల‌ను పున‌రావృతం చేయకూడ‌ద‌ని సూచించాడు. రెండేళ్లుగా పాక్ క్రికెట్ ప‌త‌న‌మ‌వుతోంద‌ని, స‌రైన దిశ‌లో ప‌నిచేయ‌క‌పోతే మ‌రింత క్షీణిస్తుంద‌ని హెచ్చ‌రించాడు. విప‌రీతంగా మార్పులు చేయ‌డం వ‌ల్ల ప్లేయ‌ర్ల ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తింటుంద‌ని, పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ఇంజ‌మాములు చెప్పుకొచ్చాడు.

Related Posts
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు

తమిళనాడులో భాషా వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. హిందీ భాషా వ్యతిరేకత, భాషా విధానాలు, విద్యా వ్యవస్థపై నియంత్రణ తదితర అంశాలపై డీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. Read more

Corona : కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు
Pakistan President corona

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి ఆయన Read more

జల్లికట్టు పోటీలు షురూ.. గెలిస్తే లక్షల్లో బహుమతి
jallikattu

మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు తమిళుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గ్రామాల్లో ఉత్సాహపూరిత వాతావరణాన్ని సృష్టించాయి. Read more

రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్ మాజీ కోచ్ రీ ఎంట్రీ
రాజస్థాన్ రాయల్స్ లోకి క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తిరిగి చేరనున్నారు.2018 నుండి 2021 వరకు ఈ ఫ్రాంచైజీతో పని చేసిన సాయిరాజ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×