ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 3 వికెట్ల తేడాతో జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ (2/34), గెరాల్డ్ కొయెట్జ్ (1/10), అర్షద్ ఖాన్ (1/18), రషీద్ ఖాన్ (1/21), సిరాజ్ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(43), బట్లర్(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్(2/22) ఆకట్టుకున్నారు.గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా తెవాటియా(11 నాటౌట్), అర్షద్‌ఖాన్(1 నాటౌట్) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
ఓపెనర్
ఈ మ్యాచ్ దాదాపు ముంబై చేతుల్లోనే ఉంది. కానీ చివరి ఓవర్లో గుజరాత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి కారణమైన ఆ ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.ముంబై ఇండియన్స్ దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంలో పూర్తిగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో హిట్ మ్యాన్ రాణించలేకపోయాడు. గుజరాత్‌పై కేవలం 7 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.ముంబై ఇండియన్స్ జట్టులో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 2 బంతులు మాత్రమే ఆడి కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్లోనే అతడిని మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు.హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీలో విఫలమయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. హార్దిక్ కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్లో 11 బంతులు వేశాడు. చివరి ఓవర్లో గుజరాత్‌కు 15 పరుగులు అవసరమైనప్పుడు,దీపక్ చాహర్ డెత్ ఓవర్లలో అంతగా బౌలింగ్ చేయకపోయినా పాండ్యా ఆ ఓవర్‌ను దీపక్ చాహర్ కు ఇచ్చాడు. పాండ్యా ఆ ఓవర్‌ను తనే వేసి ఉండాలి.

బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ చాలా ఖరీదైన ఆటగాడిగా నిరూపించబడ్డాడు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన చివరి ఓవర్లో 15 పరుగులు కూడా డిఫెండ్ చేయడంలో విఫలమయ్యాడు.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోయాడు. తిలక్ వర్మ కూడా 7 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
Read Also : IPL 2025: ముంబై ఇండియన్స్ పై గుజరాత్ ఘన విజయం