OTT: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ ఇవే..

OTT: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ ఇవే..

హార్రర్ సినిమాల అభిమానులకు శుభవార్త.మూడు హార్రర్ చిత్రాలు వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి, ఈ మూడు సినిమాలు మూడు భిన్న శైలుల్లో ఉండబోతున్నాయి.థ్రిల్లింగ్, భయం, కామెడీ కలగలిపిన వినూత్న కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాలు ఓటీటీ లోకి రాబోతున్నాయి.ఆ చిత్రాలు ఏవో తెలుసుకుందాం.

Advertisements

టుక్ టుక్ మూవీ

ఓ ఊరిలో ముగ్గురు యువకులు (హర్ష రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు) ఎలాంటి లక్ష్యం లేకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటారు. ఒక రోజు వీళ్లు చేసే చెడ్డపనికి కెమెరా కొనాలని భావిస్తారు. ఇందుకోసం వినాయక చవితి పేరిట ఊరిలో డబ్బు వసూలు చేసి కెమెరా కొనాలని నిర్ణయించుకుంటారు.అయితే, వినాయక నిమజ్జనానికి ఉపయోగించిన ఆటో కమ్ స్కూటర్‌లో కొన్ని అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి. ఆ వెంటనే ఊరిలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.అయితే అసలు ఆ వెహికల్‌లో ఆ శక్తులు ఎలా వచ్చాయి? ఆ బండి ఎందుకు కదులుతుంది? దీని వల్ల ఆ కుర్రాళ్ల జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి? ఈ చిత్రంలో మేఘ శాన్వీ పాత్రకు ఈ కుర్రాళ్ల లైఫ్‌కు ఉన్న సంబంధమేమిటి? నిహాల్‌, మేఘ శాన్వీల రిలేషన్‌ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

కింగ్స్టన్ మూవీ

కింగ్ (జీవీ ప్రకాష్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. అయితే ఈ కారణంగా ఆ ఊరికి ఉపాధి ఉండదు.అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలని అనుకుంటాడు? మరి కింగ్ చేసిన ఈ సముద్ర ప్రయాణంలో తెలుసుకున్న విషయాలు ఏంటి? కింగ్, అతని స్నేహితుల బృందం మళ్లీ సముద్రానికి తిరిగి వచ్చిందా? లేదా? ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏంటి? చార్లెస్, సాల్మాన్, బోస్ పాత్రల ఇంపార్టెన్స్ ఏంటి? అన్నదే కథ.

 OTT: ఈవారం ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ ఇవే

చోరీ 2 మూవీ

హిందీలో రూపొందిన ‘చోరీ’ సినిమా, 2021 నవంబర్లో థియేటర్లకు వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాను పేక్షకులు మరిచిపోలేదు. టేకింగ్ పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. నుష్రత్ బరూచా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. ఒక యువతి గర్భవతిగా ఉంటుంది. దెయ్యాల బారి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేసే ప్రయత్నంగా ‘చోరీ 1’ కథ సాగుతుంది. ఆమెకి బిడ్డ పుట్టిన తరువాత అదే దెయ్యాల నుంచి ప్రమాదం ఎదురవుతుంది. అప్పుడు ఆమె ఆ బిడ్డను రక్షించుకోవడం కోసం ఏం చేస్తుంది? అనేది ‘చోరీ 2’లో చూపించనున్నారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

Read Also: Empuran: ‘మంజుమ్మల్ బాయ్స్’ రికార్డును బద్దలుగొట్టిన ఎంపురాన్

Related Posts
ఈ సంద‌ర్భంగా తమ్ముడిపై ప్రేమ‌ను కురిపిస్తూ వైష్ణ‌వి ఇన్‌స్టా పోస్టు
maxresdefault

'బేబీ' సినిమా ఘన విజయంతో వైష్ణవి చైతన్య ఒక్కసారిగా తెలుగు చిత్రసీమలో సూపర్‌హిట్ హీరోయిన్‌గా మారిపోయారు. మునుపు చిన్న పాత్రల్లో కనిపించిన ఆమెకు ఈ చిత్రం బ్రేక్‌ Read more

Shihan Hussaini: ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు షిహాన్ హుసైని క‌న్నుమూత‌
Shihan Hussaini: ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు షిహాన్ హుసైని క‌న్నుమూత‌

కోలీవుడ్‌ సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసిన నటుడు షిహాన్ హుసైని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో Read more

Tamanna: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా
Tamanna: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల Read more

Pawan Kalyan son: మార్క్ శంకర్‌కి కొనసాగుతున్న చికిత్స ..ఆస్పత్రికి చేరుకున్న పవన్
Pawan Kalyan son: మార్క్ శంకర్‌కి కొనసాగుతున్న చికిత్స ..ఆస్పత్రికి చేరుకున్న పవన్

సింగపూర్‌లో అగ్నిప్రమాదం – పవన్ కుమారుడికి గాయాలు సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×