हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Donald Trump: ట్రంప్ వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి!

Vanipushpa
Donald Trump: ట్రంప్ వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుక్రవారం వార్షిక వైద్య పరీక్షలకు హాజరయ్యారు. 78 ఏళ్ల ట్రంప్‌కు మేరీలాండ్ రాష్ట్రంలోని బెథెస్ద ప్రాంతంలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. 2024 జులైలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు జరిగాయనేది తాజా వైద్యపరీక్షల నివేదికలో వెల్లడి కానుంది. ‘‘నాకు అంత మంచిగా అనిపించలేదు. అయినప్పటికీ ఈ పనులు తప్పక చేయాలి’’ అని ఆ సోషల్​ మీడియా పోస్ట్‌లో ట్రంప్​ రాసుకొచ్చారు.

ట్రంప్ వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి!

వైద్య రికార్డులను వెల్లడి చేస్తా: ట్రంప్
జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్, గత ఎన్నికల ప్రచారం వేళ ఆనాటి దేశాధ్యక్షుడు జో బైడెన్‌ శారీరక, మానసిక సామర్థ్యంపై ప్రశ్నల వర్షం గుప్పించారు. అయితే తన ఆరోగ్య సమాచారం విషయంలో మాత్రం ఆయన గోప్యత పాటించారు. ఆరోగ్య వివరాలను ఎవరికీ చెప్పలేదు. 2024 ఆగస్టులో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైద్య రికార్డులను చాలా సంతోషంగా విడుదల చేస్తానని ట్రంప్ చెప్పారు. అయితే వాటిని ఇప్పటికీ విడుదల చేయలేదు.
ట్రంప్ వర్సెస్ బైడెన్
వాస్తవానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే వయసులో డొనాల్డ్ ట్రంప్ మూడేళ్లు చిన్నవారు. 2021లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే నాటికి బైడెన్‌కు ఉన్న వయసుతో పోలిస్తే 2025 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే సమయానికి ట్రంప్‌కు ఐదు నెలలు ఎక్కువ వయసు ఉంది. ఫలితంగా అమెరికా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డును ట్రంప్ సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

READ ALSO: Donald Trump:ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లు నమోదు చేసిన ట్రంప్ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870