ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేశారనే వివాదం . సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతుండగా, కొన్ని కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఫోటోలు లక్ష్యంగా:
ఇటీవల పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో అసభ్యకరమైన బాడీ షేమింగ్ కామెంట్లు పెట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

విజయవాడ, తిరుపతిలో జనసేన ఫిర్యాదులు:
విజయవాడలో జనసేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు.జనసేన నాయకుల ఆగ్రహం – పోలీసులకు ఫిర్యాదులు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ జనసేన నాయకులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు ఈ ఘటనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని, వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్లలోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘జగనన్న సైన్యం’ అనే హ్యాండిల్ నుంచి పవన్ కల్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కఠిన చర్యల కోసం డిమాండ్:
చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన పోస్ట్ చేశాడంటూ ఫిర్యాదులు అందగా, పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు, కార్యకర్తలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని ఆధారాలను సేకరించి, నిందితులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలనే వాదన కూడా వినిపిస్తోంది.
సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్చ:
ఈ ఘటనతో సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగంపై చర్చ మొదలైంది.సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, మార్ఫింగ్ ఫొటోలు, వ్యక్తిగత దూషణలు తీవ్రంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నేతల వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరం కలిగిస్తోంది. పోలీసుల దర్యాప్తు ద్వారా అసలు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంపై నేరుగా దాడి చేయడాన్ని నిరోధించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత కఠిన నియంత్రణలు అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వినియోగించాలి – దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి!అంటూ జనసేన నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.