బిఆర్కె భవన్లో విచారణకు వెళ్లింది ఇద్దరే
హైదరాబాద్: కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission).. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 51 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టుపై కేసీఆర్ కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కారు డోరులో నిలబడి కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. నేరుగా హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ నుంచి యశోదా ఆసుపత్రిలో పల్లా రాజేశ్వర్రెడ్డిని పరామర్చించిన అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా కేసీఆర్ నేరుగా పయనమయ్యారు. కాగా కోర్టు హాల్లో కేవలం ముగ్గురికే అనుమతిచ్చిన కమిషన్.. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. కోర్టు హాల్లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతించింది. విచారణలో జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ కలిసి కేసీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్కే భవన్లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలి చారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హాజరయ్యారు. మల్లెల బాబ్జి పై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు.

114 మందిని విచారించిన కమిషన్
ఎన్టీఆర్ మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ తర్వాత బిఆర్కె భవన్లో న్యాయవిచారణ ఎదుర్కొన్న రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. మొదట ఓపెన్ కోర్టులో కేసీఆర్ బహిరంగ విచారణ జరుగుతుందని అంతా భావించినా ఆరోగ్యరీత్యా వన్ టు వన్ విచారణ కోరారు కేసీఆర్. ఆయన విజప్తిని అంగీకరించిన జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు లోపలికి 9 మందికి అనుమ తించింది. అయితే, చివరగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మా రావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు లోపలికి అనుమతించారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్లు కనిపెస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమి షన్ 115వ వ్యక్తిగా కెసిఆర్ ను ప్రశ్నించింది. ఇప్పటికే హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ కెసిఆర్ను కూడా విచారించడంతో జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో ఇక కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: GHMC : ప్రచారం కోసం జీహెచ్‌ఎంసీ తాపత్రయం