హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్(Telangana Raj Bhavan)లో చోరీ కలకలం రేపుతోంది. రాజ్‌భవన్ పరిధిలో ఉన్న సుధర్మ భవన్(Sudharma Bhavan)లో చోరీ జరిగినట్టు సమాచారం. భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ గదిలోకి దూరిన దొంగలు నాలుగు హార్డ్‌డిస్క్‌లను అపహరించారు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగిందని రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల ఫుటేజ్
ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఆధారాలతోనే చోరీకి సంబంధించిన అంశాలను గుర్తించినట్లు సమాచారం. హార్డ్‌డిస్క్‌లు మాయమైన గదిలో ఆ సమయంలో ఎవరు వెళ్లినట్టు ఉంది? ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.
హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజ్‌భవన్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాయమైన హార్డ్‌డిస్క్‌లలో ఏమి డేటా ఉందన్నదానిపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ రాజ్‌భవన్ పరిపాలన అధికారులు చర్యలు చేపట్టారు.
Read Also : India: బియ్యం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్