సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పదవీచ్యుతుడైన తరువాత దేశంలో భారీ ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న దళాలు అసద్‌ మద్దతుదారులపై పలు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి. సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పదవీచ్యుతుడైన తరువాత దేశంలో భారీ ఎత్తున హింస చెలరేగడం ఇదే మొదటిసారి.

సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

అసద్‌ మద్దతుదారులపై దాడులు

ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న దళాలు అసద్‌ మద్దతుదారులపై పలు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా అలావైట్లు నివసించే ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. అసద్‌కు మద్దతుదారులైన అలావైట్లు దేశంలో తిరుగుబాటును లేవదీసే అవకాశమున్నందున వారిని అణచివేస్తున్నామని సిరియన్‌ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలావైట్లు పై ప్రతీకార దాడులు
సిరియాలో అలావైట్లు మైనారిటీలు. మొత్తం జనాభాలో 12 శాతం ఉంటారు. లటాకియా, టార్టస్‌లలో వీరు ఎక్కువగా ఉంటారు. సిరియాను దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించిన అసద్‌ అలావైట్ల వర్గానికి చెందినవారే. అసద్‌ పాలనలో అలావైట్లు అటు సైన్యంలో ఇటు రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. అసద్‌ దేశం విడిచి వెళ్లిపోవడంతో ప్రస్తుత పాలకులకు విధేయులైన కొందరు సున్నీ వర్గీయులు.. అలావైట్లపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ వారిని ఊచకోత కోస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా అసద్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అలావైట్లు.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అలావైట్లు నివసిస్తున్న ప్రాంతాలకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేశారు. సిరియాలో హింసను అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. సిరియాలో హింస పట్ల దాని సరిహద్దు దేశాలైన టర్కీ, ఇరాక్‌, జోర్డాన్‌ ఆందోళన వ్యక్తంచేశాయి, ఈ హింస ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చని హెచ్చరించాయి.

వీధుల్లో మృతదేహాలు
హింస మొదలైన నాటి నుంచి ఇప్పటికి వెయ్యిమందికి పైగా మరణించినట్టు సిరియన్‌ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అలావైట్ల ఇండ్లను లూటీచేసిన సాయుధులు అనంతరం వాటిని దహనం చేశారు. ప్రభుత్వ దళాలు యువకులను, పురుషులను బహిరంగంగా ఉరి తీస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికులు చె ప్పారు. అసద్‌ మద్దతుదారులకు మరోదారి లేదని, లొంగిపోవాల్సిందేనని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మ ద్‌ అల్‌ షరా పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై జీహాద్‌ ప్రకటించిందని, ఒక్కో ఇంటిని జల్లెడ పడుతూ అలావైట్లను అంతమొందిస్తున్నారని లటాకియా ప్రాంతానికి చెందిన ఓ పౌరుడు చెప్పారు.

Related Posts
వీరరాఘవ రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ
veeraraghava custady

రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు కస్టడీ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవ రెడ్డిని మూడ్రోజుల పాటు పోలీస్ Read more

తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత
kavitha telangana thalli

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, Read more

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. జార్ఖండ్ హైకోర్టు Read more

మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..
IT searches in Hyderabad again

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *